BigTV English

Two-Wheeler Safety in Rainy Season: వర్షాకాలంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ బండ్లను భద్రంగా కాపాడుకోండి..!

Two-Wheeler Safety in Rainy Season: వర్షాకాలంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ బండ్లను భద్రంగా కాపాడుకోండి..!

Bike safety in Rainy Season: వర్షాకాలం మొదలైంది. ప్రతి రోజు వాన కురుస్తూనే ఉంది. తెల్లవారి మొదలెడితే అలా చిన్న చిన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఒక్కోసారి వర్షం భారీ స్థాయిలో విరుచుకుపడుతుంది. దాదాపు గంట రెండు గంటల పాటు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు చోట్ల వర్షపు నీరు వచ్చి చేరుతుంది. అయితే ఇలాంటి సమయంలో మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా మన వాహనాలను కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే వాహనాలు సెడ్డుకి ఇవ్వాల్సి ఉంటుంది.


కొన్ని చోట్ల గంటపాటు కురిసిన వర్షానికే మోకాలి లోతు నీరు చేరిపోతుంది. అలాంటి సమయంలో వాహనాలను నడిపితే అధిక నష్టం జరుగుతుంది. ముఖ్యంగా మోకాలి లోతు నీటిలో వాహనాలను డ్రైవింగ్ చేయడం ద్వారా చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. అలా కొన్ని రోజులకు అవి పనిచేయవు. ఇలాంటి సమస్య ఎక్కువగా టూ వీలర్ వాహనాల్లో జరుగుతుంది. అయితే వర్షపు నీటిలో డ్రైవింగ్ చేయడం వల్ల టూ వీలర్ వాహనానికి ఏర్పడ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక వర్షం కురిసిన తర్వాత మోకాలి లోతు నీటిలో డ్రైవింగ్ చేయడం వల్ల ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంజిన్, దానినుండి పొగను విడుదల చేసే ఎగ్జాస్ట్ పైప్ టూ వీలర్ వాహనాలకు తీవ్ర నష్టం చేకురుస్తుంది. ఎందుకంటే ఇంజన్, ఎగ్జాస్ట్ పైప్‌లకు చిన్న చిన్న రంద్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను ఇంజిన్‌ వ్యవస్థలో గాలి వెళ్లడానికి ఏర్పాటు చేస్తారు. అందువల్ల వర్షపు నీరు ఆ రంధ్రాల్లోకి వెళ్లినపుడు అది బయట, లోపల తుప్పు పడుతుంది. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి.


Also Read: చీపెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ధర తక్కువ.. రేంజ్ చాలా ఎక్కువ!

అదే సమయంలో స్పార్క్ ప్లగ్ దెబ్బ తినడం వల్ల ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేయలేరు. ఇదంతా ఒకెత్తయితే ఇంజిన్‌లో హైడ్రోలాక్ సమస్య వచ్చిందంటే మీరు మీ వాహనాన్ని షెడ్డుకు పంపించి అధిక మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ఇంజిన్‌కి ఉన్న రంద్రాల ద్వారా నీరు లోపలి వెళ్లినపుడు మీ వాహనాన్ని స్టార్ట్ చేయడం వల్ల అధిక పీడనం ఏర్పడుతుంది. దీనికారణంగా ఇంజిన్ పూర్తిగా ఆగిపోయే ప్రమాదం తలెత్తుతుంది. అలాగే వర్షపు నీటిలో ద్విచక్ర వాహనం ఎక్కువ సేపు ఉండటం వల్ల అందులో ఉండే ఎలక్ట్రికల్ కంపోనెంట్స్ చాలా వరకు దెబ్బ తింటాయి.

అదీగాక ప్రస్తుత ద్విచక్రవాహనాల్లో ఎక్కువగా టెక్నాలజీ ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. అందువల్ల అవి తొందరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ద్విచక్ర వాహనాల్లో ఉండే వైర్లలోకి నీరు వెళితే త్వరగా తుప్పుపట్టి పోతాయి. అలాగే ఇంజిన్, ఎలక్ట్రిక్ విభాగాలతో పాటు బ్రేకులు కూడా వర్షపు నీరుకి ప్రభావితమవుతాయి. వర్షంలో ద్విచక్ర వాహనం నడపడం వల్ల బ్రేక్ సిస్టమ్‌లోని కాలిపర్లు, డిస్క్‌లు/ వీల్‌బేరింగ్‌లు దెబ్బతింటాయి. దీని కారణంగా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశాలు ఉంటాయి.

Also Read: Tata Curvv: లాంచ్‌కు సిద్ధమైన టాటా కర్వ్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిమీ రేంజ్!

ఒకానొక సమయంలో బ్రేక్ ప్యాడ్‌లు విరిగిపోయే ఛాన్స్‌లు కూడా ఉంటాయి. అలాగే చైన్, స్ప్రాకెట్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా వరకు నీరు నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాలి. వర్షంలో వాహనాలను ఎక్కువసేపు ఉంచకూడదు. అలాగే రోడ్లపై అధికంగా ప్రవహించే నీరు కాస్త తగ్గిన తర్వాత వెళితే మంచిది. అప్పుడు అయితేనే వాహనాలను రక్షించుకోగలుగుతాం. లేదంటే వాహనాలను షెడ్డులో పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి

Tags

Related News

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Real Estate: ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఏంటి..? మీ సొంత ఇంటి కలను ఇలాంటి ఆఫర్స్ ఎలా ముంచేస్తాయి..

Real Estate: బ్యాంకులు వేలం వేసే ఇళ్లను చాలా చీప్‌గా కొనేయొచ్చు.. మరి, ఆ వేలంలో ఎలా పాల్గోవాలి ?

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Big Stories

×