Kohli VS Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. కేవలం ప్లే ఆఫ్స్ మ్యాచ్ లతో పాటు ఫైనల్ జరగాల్సి ఉంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బరిలో ఉన్నాయి. మే 31వ తేదీతో టోర్నమెంట్ కూడా ముగియనుంది. ఇలాంటి క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా (Australia) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL 2027 ) నేపథ్యంలో తమ దిగ్గజ బౌలర్లు ప్యాట్ కమిన్స్ ( Pat Cummins), మిచెల్ స్టార్క్ ( Mitchell Starc), అలాగే జోష్ హాజెల్‌వుడ్ లను ( Josh Hazlewood ) ఇండియాకు పంపించకూడదని డిసైడ్ అయిందట క్రికెట్ ఆస్ట్రేలియా. అంటే ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు 2027 ఐపీఎల్ టోర్నమెంట్ కు దూరం కాబోతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో వాళ్లకు స్ట్రెస్ ఉండకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2027 నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ ( Pat Cummins), మిచెల్ స్టార్క్ ( Mitchell Starc), అలాగే జోష్ హాజెల్‌వుడ్ ( Josh Hazlewood ) ఈ ముగ్గురు క్రికెటర్లను ఇండియాకు పంపించకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా డిసైడ్ అయిందట. ఈ ముగ్గురితో పాటు కోహ్లీ వివాదం నేపథ్యంలో ట్రావిస్ హెడ్ కూడా ఇదే ఆదేశాలు జారీ చేసిందట క్రికెట్ ఆస్ట్రేలియా. అంటే మొత్తం నలుగురు క్రికెటర్లు ఐపీఎల్ 2027 కు దాదాపు దూరమైనట్లేనని ఏం చెప్పవచ్చు. ఇదే జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఊహించని షాక్ తగిలే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ హోదాలో హైదరాబాద్ జట్టుకు సేవలు అందిస్తున్నాడు. అటు హెడ్ కూడా ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఇద్దరు లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చాలా కష్టమే అవుతుంది. వాళ్ళ ప్లేస్ లో కొత్త ప్లేయర్లు వచ్చినా కూడా సరైన ఫలితాలు రాకపోవచ్చు.
2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతోంది. దానికంటే ముందు 2027 సంవత్సరంలో జనవరి 21వ తేదీ నుంచి మార్చి మూడవ తేదీ వరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ సందర్భంగా ఐదు టెస్టులు ఆడుతుంది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో సాంప్రదాయ యాషెస్ సిరీస్ కూడా షురూ అవుతుంది. అనంతరం వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ మాసంలో ప్రారంభం కానుంది. ఈ అన్ని టోర్నమెంట్లకు ఆస్ట్రేలియా దిగ్గజాలు నలుగురు కూడా ఆడాల్సి ఉంది. అందుకే ఐపీఎల్ 2027 ను స్కిప్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందట.
ఒకవేళ ఐపీఎల్ ఆడితే ఎవరో ఒకరు గాయపడితే మాత్రం ఆస్ట్రేలియా కోల్పోవడం కష్టం. మొన్న 2026 టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ సందర్భంగా కూడా ఇదే జరిగి ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయింది. అందుకే ముందు జాగ్రత్తగా క్రికెట్ ఆస్ట్రేలియా ఇలాంటి కండిషన్లు పెడుతోంది. ఇక హెడ్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా కోహ్లీ సంఘటనను ఆధారంగా చేసుకొని నిర్ణయం తీసుకుందట. ఇంత అవమానం జరిగినా కూడా ఐపీఎల్ టోర్నమెంట్ లో హెడ్ ఆడడం ఏమాత్రం కరెక్ట్ కాదని క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే హెడ్ విషయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా నిజంగానే ఈ నిర్ణయం తీసుకుందా ? కావాలని కొంతమంది ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారా ? అనేది తెలియాల్సి ఉంది.
Breaking 🚨
Australian Trio likely to miss IPL 2027 due to busy test schedule. Ashes and border gavaskar test series are scheduled in 2027. pic.twitter.com/BBcQTXmhl7
— Qamar (@Qamar5618) May 25, 2026