Inzamam-ul-Haq: ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. సూర్య కుమార్ యాదవ్ ను పక్కకు పెట్టి, అనవసరంగా శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇచ్చారని మండిపడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం భిన్నంగా స్పందించారు. టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ బాగా సెట్ అవుతాడని.. కోహ్లీ కంటే మంచి సారధ్యాన్ని అతడి నుంచి అంచనా వేయవచ్చని వెల్లడించారు. ఇప్పుడే శ్రేయస్ అయ్యర్ ను విమర్శించి.. అతనిపై వేటు వేయకూడదని కోరారు. భవిష్యత్తులో గొప్ప కెప్టెన్ కావడం గ్యారెంటీ అని తెలిపారు. అప్పుడు టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ విషయం తెలియకుండా.. నాలుగు మ్యాచ్ లు ఓడిపోగానే.. శ్రేయస్ అయ్యర్ ను తొలగించాల్సిందేనని చాలా మంది విమర్శలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐర్లాండ్ సిరీస్ లో టీమిండియా వైట్ వాష్ అయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా టీమిండియా గెలవడం కష్టమేనని అంటున్నారు. ఇప్పటికే రెండు టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన ఓటమిపాలైంది. గురువారం జరిగే మ్యాచ్ లో కచ్చితంగా టీం ఇండియా గెలవాలి… లేకపోతే సిరీస్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాం చాలా భిన్నంగా స్పందించారు. దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ కంటే శ్రేయస్ అయ్యర్ బెస్ట్ కెప్టెన్ అన్నారు. అంతేకాకుండా మిడిల్ ఆర్డర్ లో టీం ఇండియాను ఆదుకునే సత్తా ఉన్న ప్లేయర్ అని ప్రశంసించారు.
విరాట్ కోహ్లీ కంటే టీం ఇండియాను బెటర్ గా లీడ్ చేయగల కెపాసిటీ శ్రేయస్ అయ్యర్ లో ఉందన్నారు. స్టార్టింగ్ లో కాస్త స్ట్రగుల్ అయినప్పటికీ… ఫ్యూచర్లో అతడిని కొట్టే మొనగాడు ఉండబోడంటూ కితాబు ఇచ్చారు ఇంజమాం. తన అంచనా ప్రకారం బాబర్ రేంజ్ కు శ్రేయస్ అయ్యర్ రావడం గ్యారంటీ అని తెలిపారు. అంతేకానీ ఇప్పుడే శ్రేయస్ అయ్యర్ పై విమర్శలు చేయకూడదని కోరారు. ఇప్పుడు విమర్శలు చేసి అనవసరంగా అతనిపై వేటు వేయకూడదని వెల్లడించారు. అతని కెప్టెన్సీలో టీమిండియా కు బంగారు భవిష్యత్తు ఉందని అంచనా వేశారు.