Mohammad Kaif : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఫినిష్ అయ్యాయి. ఇందులో మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా… ఆ తర్వాత రెండింటిలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. నిన్న టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య బ్రిడ్జి హోమ్ వేదికగా మూడవ టి20 (England vs India, 3rd T20I) జరిగింది. ఇందులో చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా… 125 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో టీమిండియా జనాలు ట్రోలింగ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా శివం దుబే ( Shivam Dube) కంటే ముందు హర్షిత్ రాణా ( Harshit Rana) బ్యాటింగ్ కు రావడం పట్ల విమర్శలు కూడా వస్తున్నాయి. మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) కూడా ఇదే అంశంపై స్పందించారు. గౌతమ్ గంభీర్ కు అసలు బుర్రలేదని… వాడి మూర్ఖత్వం వల్ల ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మార్చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. దీనివల్ల టీమిండియా వరుసగా ఓడిపోతూ వస్తోందని ఆగ్రహించారు. దీంతో మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ టి20 నేపథ్యంలో హర్షిత్ రాణా కాస్త ముందుగానే బ్యాటింగ్ కు వచ్చాడు. పవర్ ప్లే ముగియకముందే టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. అలాంటి సమయంలో డేంజర్ ఆల్ రౌండర్ శివం దుబే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ, అతడిని కాకుండా ఏడవ వికెట్ కు హర్షిత్ రాణాను పంపించారు గౌతమ్ గంభీర్. దీంతో ఎనిమిదవ వికెట్ కు సిక్స్ ల వీరుడు శివం దుబే దిగాల్సి వచ్చింది. దీనిపై మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) సీరియస్ అయ్యారు.
శివం దుబే ( Shivam Dube) కంటే హర్షిత్ రాణా పెద్ద పోటుగాడా? వాడికి అంతలా ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. శివం దుబేను కాదని హర్షిత్ రాణాను పంపించడం బుర్ర తక్కువ పని అంటూ ఆగ్రహించారు. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు… ఇలా చేయడం దుర్మార్గమన్నారు. గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాల వల్ల… టీమిండియా ఇప్పుడు వైట్ వాష్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని బాంబు పేల్చాడు. హర్షిత్ రాణా స్థానంలో శివం దుబే వచ్చి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని హితువు పలికారు. ఇక అటు దినేష్ కార్తీక్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.