Inzamam-ul-Haq: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India, 5th T20I) మధ్య శనివారం 5వ టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లాండు… వైట్ వాష్ చేసే దిశగా దూసుకు వెళ్తోంది. ఈ రెండు జట్ల మధ్య రోజ్ బౌల్, సౌతాంప్టన్ స్టేడియం (The Rose Bowl, Southampton) వేదికగా ఐదవ టి20 కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు ఊహించని పరిణామం ఎదురైంది. ఏడు గంటలకు టాస్ ఉండగా… సమయానికి టీమిండియా స్టేడియానికి చేరుకోలేదు. నగరంలోని ట్రాఫిక్ లో (Team India got stuck in traffic in England) ఇరుక్కున్న నేపథ్యంలో… మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో టీమిండియా సమయానికి స్టేడియానికి రాలేదంటూ హేళన చేశారు. వైట్ వాష్ అవుతామన్న భయంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కుట్రలు చేసినట్లు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం వేస్తున్నాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India, 5th T20I) మధ్య రోజ్ బౌల్, సౌతాంప్టన్ స్టేడియం (The Rose Bowl, Southampton) వేదికగా ఐదవ టి20 జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ సరిగ్గా 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ 30 నిమిషాల పాటు ఆలస్యంగా షురూ అయింది. హోటల్ రూమ్ నుంచి బయలుదేరిన టీమిండియా బస్సు, ట్రాఫిక్ లోకి చిక్కుకుందట. ఈ మేరకు టీమిండియా యాజమాన్యం సమాచారం కూడా ఇచ్చింది. ఈ క్రమంలో మ్యాచ్ 7:30 కు ప్రారంభమైంది. అంటే 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైనట్లు చెప్పవచ్చు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఓడిపోయిన టీమిండియా.. నాలుగో ఓటమి ఎదురవుతుందని భయపడిపోయినట్లు బాంబు పేల్చారు. అందుకే ట్రాఫిక్ పేరుతో మ్యాచ్ కు ఆలస్యంగా వచ్చారని ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్ కు ఆలస్యంగా వస్తే… రద్దవుతుందని పిచ్చి వేషాలు వేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి… బిసిసిఐకి స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళిందని… ఈ క్రమంలోనే వెంటనే టీమిండియా ప్లేయర్లు స్టేడియానికి చేరుకున్నట్లు ఆరోపణ చేశారు. అయినప్పటికీ 30 నిమిషాల ఆలస్యంతో మ్యాచ్ ప్రారంభమైనట్లు వివరించారు. చరిత్రలో ఇప్పుడు కూడా ఒక జట్టు ట్రాఫిక్ లో ఇరుక్కున్న సంఘటనలు జరగలేదని హేళన చేశారు.