E-Paper
Advertisement

CM Revanth vs Lionel Messi: మ‌రికాసేప‌ట్లో ఉప్ప‌ల్ స్టేడియానికి మెస్సీ, సీఎం రేవంత్‌..30 నిమిషాలు మ్యాచ్ ఆల‌స్యం !

CM Revanth vs Lionel Messi: మ‌రికాసేప‌ట్లో ఉప్ప‌ల్ స్టేడియానికి మెస్సీ, సీఎం రేవంత్‌..30 నిమిషాలు మ్యాచ్ ఆల‌స్యం !
Advertisement

CM Revanth vs Lionel Messi:  హైద‌రాబాద్ కు చేరుకున్న లియోనెల్ మెస్సీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికింది రేవంత్ రెడ్డి స‌ర్కార్. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఫ‌లక్ నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు లియోనెల్ మెస్సీ.  ఫలక్ నుమా ప్యాలెస్ లో మెస్సీకి ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైర‌ల్ గా మారింది. అక్క‌డ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో లియోనెల్ మెస్సీ స‌మావేశం అయ్యారు.  ఇక మ‌రికాసేప‌ట్లో ఉప్ప‌ల్ స్టేడియానికి లియోనెల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ప‌య‌నం కానున్నారు. వారితో పాటే రాహుల్ గాంధీ కూడా ఉప్ప‌ల్ స్టేడియానికి రానున్నారు. అటు లియోనెల్ మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్ మ్యాచ్  ( CM Revanth vs Lionel Messi ) కోసం ఉప్ప‌ల్ కు భారీగా చేరుకుంటున్నారు అభిమానులు.

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

ఉప్ప‌ల్ స్టేడియం ద‌గ్గ‌ర భారీ ఏర్పాట్లు

Advertisement

లియోనెల్ మెస్సీ హైద‌రాబాద్ పర్య‌ట‌న దాదాపు 30 నిమిషాలు ఆల‌స్యంగా కొన‌సాగుతోంది. దీంతో మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్ మ్యాచ్ కూడా ఆల‌స్యంగా ప్రారంభం కానుంద‌ట‌. అటు కోల్ క‌తా ఘటన నేపథ్యంలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు హైద‌రాబాద్ పోలీసులు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా కంచె ఏర్పాటు చేసిన పోలీసులు..ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

అభిమానులు స్టేడియం గ్రౌండ్ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అన్ని ఫ్లోర్లలో సీటింగ్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ టికెట్ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. ఈ భ‌ద్ర‌తా ఏర్పాట్ల న‌డుమ‌ లియోనెల్ మెస్సీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్దమైంది ఉప్పల్ స్టేడియం. సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొనబోతున్న నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.

మెస్సీ మ్యాచ్ కు భారీ భద్రత ఏర్పాటు – డీజీపీ శివధర్ రెడ్డి

Advertisement

కల్ కతా ఘటన నేపథ్యంలో మెస్సీ ( Messi) ఉప్ప‌ల్ మ్యాచ్ కు భారీ భద్రత ఏర్పాటు చేశామ‌న్నారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (dgp shasidhar reddy). కోల్ కతాలో రోప్ పార్టీలు లేకపోవడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంద‌ని వివ‌రించారు. అక్కడ జరిగిన లోపాలు తెలుసుకుని ఇక్కడ అప్రమత్తంగా ఉన్నామన్నారు. రాత్రి.7.15కు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి వస్తారని వివ‌రించారు డీజీపీ శివధర్ రెడ్డి. కేవలం క్రీడాస్ఫూర్తి, ఫుట్ బాల్ ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఇదన్నారు. మొత్తం ప్రోగ్రాం దాదాపు గంట సేపు ఉంటుందని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

 

 

 

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×