Watch Video : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగానే ఈ ఆట గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఆటగాడు ఒక్కో స్టైల్ లో ఆడుతున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ అయినా.. బౌలింగ్ అయినా.. ఫీల్డింగ్ అయినా, కీపింగ్ అయినా, రన్నింగ్ అయినా ఏది అయినా వెరైటీగా చేస్తున్నారు. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అది కాస్త వైరల్ అవుతోంది. దాని గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకోవడం విశేషం. ఇలా సందర్భాల్లో చోటు చేసుకుంది. ముఖ్యంగా కొందరూ గల్లీ క్రికెట్ రకరకాల చిత్ర విచిత్రంగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అవి తెగ వైరల్ అవుతున్నాయి. బౌలర్ స్పీడుగా పరుగెత్తుకొచ్చి రెండు చేతులతో తిప్పి..ఏ చేత్తో బంతి వేస్తున్నాడో అర్థం కాకుండా.. మరోవైపు బ్యాటర్ బంతిని కొడితే అది వికెట్లు తాకుతుందో లేక ఎక్కడికి వెళ్తుందో గుర్తు పట్టడం కష్టంగా మారుతుంది. మరోవైపు కొందరూ బంతిని పట్టుకునేందుకు బకెట్ ఉపయోగించడం.. ఇలా మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతున్నాయి.
Also Read : Randy Orton: HHH భార్యకు లిప్ కిస్…ఆ రోజు నరకం చూసిన రాండి ఆర్టాన్
బౌలింగ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
తాజాగా సోషల్ మీడియాలో ఓవీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక కుర్రాడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లుగా సీసాలు పెట్టినా సీసాలను క్లీన్ బౌల్డ్ చేశాడు. అలాగే వికెట్లకు అడ్డుగా టైర్ పంపినా ఆ టైర్ మధ్యలోంచి బంతి వేసి వికెట్లను బౌల్డ్ చేశాడు. కేవలం ఒకే ఒక్క వికెట్ ఉంచినా ఆ వికెట్ ను సైతం క్లీన్ బౌల్డ్ చేశాడు. టైర్ మధ్యలో సీసాలు వికెట్ మాదిరిగా పెట్టినా వాటిని కూడా బౌల్డ్ చేశాడు. రాళ్ల మధ్యలో కింద వికెట్లు పెట్టినా, సీసా పెట్టినా ఏది పెట్టినా కానీ అతని బౌలింగ్ వాటిని క్లీన్ బౌల్డ్ చేస్తున్నాడు. ఇక ఇలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తులు చాలా మంది పల్లెటూర్లలో ఉంటారు. ప్రతిభ ఉన్న వారు.. బయటికి రారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వెలుగులోకి వస్తున్నారు.
ఏం బౌలింగ్ గురూ..!
ముఖ్యంగా టాలెంట్ ఎవ్వరి సొత్తు కాదని నిరూపించాడు ఈ యువకుడు. అస్సలు ఎలాంటి పిచ్ అయినా అదిరిపోయే బౌలింగ్ తో వికెట్లు పడగొట్టే ఇతని టాలెంట్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్కార్క్, మలింగ, బుమ్రా మాదిరిగా వేగంతో పాటు గురి తప్పని బౌలింగ్ అంటూ అతన్ని అభినందిస్తున్నారు. ఈ వీడియో ను బీసీసీసీ కి ట్యాగ్ చేస్తూ జట్టులోకి తీసుకోవాలంటూ కొందరూ డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభ కు ఇతడే నిదర్శనమని పేర్కొంటున్నారు. టాలెంట్ ఉండి టాలెంట్ ని వినియోగించుకొని ఆటగాళ్లు ఇలా చాలా మందే ఉన్నారని ఈ వీడియో ద్వారా స్పష్టంగా కనపిస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో చాలా మంది యువకులు వెలుగులోకి రాలేకపోతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని గుర్తించి ప్రపంచానికి పరిచయం చేస్తే వారు అధ్భుతంగా రాణిస్తారు.
With such focus and talent at this age, he deserves our support. Let’s help him shine. pic.twitter.com/DunyFHTu4x
— Out Of Context Cricket (@GemsOfCricket) July 15, 2025