BigTV English

Randy Orton: HHH భార్యకు లిప్ కిస్…ఆ రోజు నరకం చూసిన రాండి ఆర్టాన్

Randy Orton: HHH భార్యకు లిప్ కిస్…ఆ రోజు నరకం చూసిన రాండి ఆర్టాన్

Randy Orton:  రెజ్లింగ్ స్టార్ రాండి ఆర్టాన్ ( Randy Orton ) గురించి తెలియని వారు ఉండరు. 45 సంవత్సరాలు ఉన్న రాండి ఆర్టాన్… ఇప్పటికి కూడా రెజ్లింగ్… ఆడుతున్నాడు. దొంగ దెబ్బ తీయడం, వెన్నుపోటు పొడవడం… దొంగ చాటున మ్యాచ్ గెలవడం… అంటే టక్కున గుర్తుకు వచ్చేది రెజ్లర్ రాండి ఆర్టాన్ పేరు మాత్రమే. అయితే అలాంటి  రాండి ఆర్టాన్ కు ఓ రోజంతా ఆ చుక్కలు చూపించాడు స్టార్ రెజ్లర్ HHH. తన భార్యను ముద్దు పెట్టుకున్నందుకు గాను… రాండి ఆర్టాన్ ను… ఉడికించి మరి కొట్టాడు అరి వీర భయంకరమైన HHH.


స్టెపని మిక్ మాన్ కు ముద్దుపెట్టిన రాండి ఆర్టాన్

డబ్ల్యూ డబ్ల్యూ ఈ రెజ్లింగ్ లో ( WWE ) ఒకరి పై మరొకరు పోట్లాడాల్సిందే. అయితే ఈ ఫైటింగ్ కేవలం రింగులో ఉంటే పర్వాలేదు. బయట కూడా ఫైట్ చేస్తే.. అభిమానులు ఏమాత్రం అంగీకరించరు. కానీ వీటన్నిటికీ పూర్తిగా భిన్నంగా రాండి ఆర్టాన్ వ్యవహరిస్తూ ఉంటాడు. అప్పట్లో…HHH సతీమణి స్టెఫానీ మెక్‌ మాన్ RAW చైర్మన్ గా ఉన్నప్పుడు రాండి ఆర్టాన్ బీభత్సం సృష్టించాడు. HHH భార్య స్టెఫానీ మెక్‌మాన్ కు ముద్దు పెట్టాడు. HHH ను దొంగ దెబ్బ తీసి… అతన్ని కట్టేశాడు రాండి ఆర్టాన్ , అతని అనుచరులు ఇద్దరు.


ఈ నేపథ్యంలోనే రింగులోకి HHH సతీమణి  స్టెఫానీ మెక్‌మాన్ కూడా వచ్చారు. అదే సమయంలో స్టెఫానీ మెక్‌మాన్ పై కూడా అటాక్ చేసింది రాండి ఆర్టాన్ టీం. ఇలాంటి నేపథ్యంలోనే… HHH భార్య స్టెఫానీ మెక్‌మాన్ కు ముద్దు పెడతాడు రాండి ఆర్టాన్. అది కూడా రింగులోనే ముద్దు పెట్టడం గమనార్హం. భర్త చూస్తుండగానే భార్యకు ముద్దు పెడితే ఎలాగుంటుంది… అలాంటిది HHH లాంటి భయంకరమైన రెజ్లర్ ఆ బాధను అనుభవిస్తూ చూస్తూ ఊరుకుంటాడా? కచ్చితంగా రివేంజ్ తీర్చుకుంటాడు.

దాదాపు నెల రోజుల సమయం తీసుకున్న తర్వాత… అందరూ ఊహించినట్లుగానే రాండి ఆర్టాన్ ( Randy Orton ) టీం పైన బెబ్బులి లాగా విరుచుకుపడ్డాడు HHH. తన రెగ్యులర్ ఆయుధమైన సుత్తే తో రాండి ఆర్టాన్ టీం ను ఉరికించి మరి కొట్టాడు. గదిలోకి వెళ్లి దాచుకుంటే… డోర్ పగలగొట్టి మరి లోపలికి వెళ్ళాడు. అనంతరం.. రాండి ఆర్టాన్ ను దారుణంగా కొట్టాడు HHH.

ముద్దు పెట్టడం పై రాండి ఆర్టాన్ క్లారిటీ

HHH సతీ మణి స్టెఫానీ మెక్‌మాన్ కి ముద్దు పెట్టడంపై తాజాగా స్పందించాడు రాండి ఆర్టాన్. అది కూడా స్టెఫినీ మిక్ మాన్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఆ రోజు అనుకోకుండా ముద్దు పెట్టానని వివరించాడు. గందరగోళ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో… అలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ముద్దు పెట్టిన తర్వాత తనకు నిద్ర పట్టలేదని.. ప్యాంటు మొత్తం తడిచినట్లే అయిపోయిందని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత భయంతో జీవించానని పేర్కొన్నాడు రాండి ఆర్టాన్.

Related News

Heinrich Classen : నెలకొక టోర్నమెంట్… కాటేరమ్మ కొడుకు అంటే మామూలుగా ఉండదు… ప్రపంచంలోనే బిజీయస్ట్ క్రికెటర్

Ms Dhoni : MS ధోనీనే నా స్ఫూర్తి.. ఆయన రియల్ హీరో.. పాకిస్తాన్ కెప్టెన్ సంచలనం

Sehwag -Mendis : మిస్టరీ స్పిన్నర్ మెండిస్ కెరీర్ నాశనం చేసిన సెహ్వాగ్.. మరి వీరూతో పెట్టుకుంటే మాడి మసి కావాల్సిందే !

MS Dhoni: 43 బ్రాండ్లకు ధోని బ్రాండ్ అంబాసిడర్… కోహ్లీ కూడా వెనుకబడిపోయాడు..టాప్ 5 లిస్ట్ ఇదే!

ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్… ఇంగ్లాండ్ ను వెనక్కి నెట్టిన ఆఫ్ఘనిస్తాన్.. చరిత్రలోనే తొలిసారి

Sikandar Raja : ఎవర్రా వీడు.. 39 ఏళ్ల వయసులో నెంబర్ వన్ ఆల్రౌండర్ గా చరిత్ర.. ఇంతకీ ఎవరీ సికిందర్ రాజా

Big Stories

×