Mitchell Starc Record: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 – 27 లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడు టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా జట్టు.. అన్నింట్లోనూ గెలుపొందింది.
Also Read: Mohammed Siraj wicket: సిరాజ్ వికెట్..కెమెరామెన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు కదరా !
కింగ్ స్టన్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మూడవ టెస్టులో ఆస్ట్రేలియా ఏకంగా 176 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లను 121 పరుగులకే కట్టడి చేశామని సంబరపడే లోపు.. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి కరేబియన్లు విలవిలలాడారు.
27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్:
రెండవ ఇన్నింగ్స్ లో 204 పరుగుల చేదనలో వెస్టిండీస్.. కేవలం 27 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా 176 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండవ అత్యల్ప స్కోరు. స్టార్క్ దెబ్బకు రెండవ ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు విలవిలలాడారు. నిప్పులు చెరిగే బంతుల విసురుతూ ప్రత్యర్థి జట్టులోని బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు స్టార్క్. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కి 100వ టెస్ట్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో స్టార్క్.. తన తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. అదే ఓవర్ లో మరో రెండు వికెట్లు తీసి.. తొలి ఓవర్ లోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
మొత్తంగా ఈ ఇన్నింగ్స్ లో స్టార్క్ కేవలం 15 బంతుల వ్యవధిలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. క్రికెట్ చరిత్రలో బంతులపరంగా అత్యంత వేగంగా నమోదైన ఐదు వికెట్ల ఘనత ఇదే. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 7.3 ఓవర్లు వేసిన స్టార్క్.. కేవలం 9 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. దీంతో వెస్టిండీస్ 27 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలయింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3 – 0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్ కి స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. మిచెల్ స్టార్క్ కు విలయతాండవానికి వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. జాన్ క్యాంప్ బెల్, కెవియోన్ అండర్సన్, బ్రాండన్ కింగ్, రోస్టర్ చేజ్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్, జేడన్ సీల్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు.
స్టార్క్ రివెంజ్:
అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టార్క్ వికెట్ ని జేడెన్ సీల్స్ పడగొట్టాడు. ఆ సమయంలో సీల్స్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. స్టార్క్ వైపు వేలుపెట్టి మరీ చూపించాడు. ఇక దీనికి అదే సెకండ్ ఇన్నింగ్స్ లో కౌంటర్ ఇచ్చాడు స్టార్క్. సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్క్ ఆరు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. అయితే సీల్స్ వికెట్ పడగొట్టిన తర్వాత.. స్టార్క్ కూడా సీల్స్ వైపు వేలు పెట్టి చూపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. స్టార్క్ రివేంజ్ తీర్చుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
?utm_source=ig_web_copy_link