Digvesh Rathi : లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడె దిగ్వేష్ రాథి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఐపీఎల్ 2025లో ఓ ఆసక్తికర సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ.. దిగ్వేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో అభిషేక్ శర్మను ఔట్ చేసిన దిగ్వేష్.. అతని పై నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేశాడు. ఇది అభిషేక్ శర్మను కాస్త అసహనానికి గురి చేసింది. పిచ్ విడిచే ముందు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పటి నుంచి హ్యాండ్ షేక్ సమయంలో కూడా వాగ్వాదం కొనసాగింది. చివరికీ ఇద్దరినీ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. LSG యజమాని సంజీవ్ గోయెంకా పిలిచి మాట్లాడాల్సి వచ్చింది. తాజాగా DPL లో మరో ఆసక్తికర సంఘటన చేసుకుంది.
Also Read : Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు
దిగ్వేష్-అంకిత్ మధ్య వివాదం
డీపీఎల్ రెండో సీజన్ లో దిగ్వేష్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్.. వెస్ట్ ఢిల్లీ లయన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బ్యాటర్ అంకిత్ కుమార్ తో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో రెండు బంతులు విసిరేసిందుకు లైన్ వద్దకు చేరుకొని దిగ్వేష్ బంతి విసిరివేయలేదు. దీంతో దీనికి కౌంటర్ గా అంకిత్ కుమార్ వరుస రెండు బంతులను రెండు సిక్సర్లుగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ వర్సెస్ వెస్ట్ ఢిల్లీ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో దిగ్వేష్ రాథి అంకిత్ కుమార్ తో కలిసి లంచ్ సమయంలో మాంసం తింటూ కనిపించడం గమనార్హం. బంతిని డెలివరీ చేయడానికి ముందు దిగ్వేష్ వెనక్కి తగ్గడంతో పాటు.. అంకిత్ అదే పని చేశాడు. మరోవైపు ఈ ఇన్నింగ్స్ లో అంకిత్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి తన గ్లౌస్ తో సిగ్నల్ ఇచ్చాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
అంకిత్ అదిరిపోయే సిక్స్ లు
ఇక ఈ మ్యాచ్ లో విజయం కోసం 186 పరుగుల ఛేదనలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఇన్నింగ్స్ లో 5వ ఓవర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ క్షణం సంభవించింది. ఇద్దరిలో దిగ్వేష్ తొలత బంతిని వేయకుండా ఆపితే.. అంకిత్ డెలివరీని పంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అంకిత్ కూడా బ్యాటింగ్ చేయకుండా పక్కకు జరగడంతో ఇది వివాదంగా మారింది. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 186 పరుగుల స్కోర్ ను ఛేదించిన అంకిత్ 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. క్రిష్ యాదవ్ 67.. ఇక లక్ష్యాన్ని ఛేదించడానికి లయన్స్ కి 15.4 ఓవర్లు మాత్రమే అవసరం అని చెప్పవచ్చు.
Controversy King Digvesh Rathi In News Again! LSG Spinner Spotted Abusing In DPL!
Full details : https://t.co/uWo21ez8rG#DPL2025 pic.twitter.com/WwS199mSSD
— OneCricket (@OneCricketApp) August 6, 2025