BigTV English

OTT Movie : నెట్ ఫ్లిక్స్‌ను ఓ ఊ‌పు ఊపేసిన సిరీస్… భారీ వ్యూస్ తో పాటు వివాదాలు కూడా

OTT Movie : నెట్ ఫ్లిక్స్‌ను ఓ ఊ‌పు ఊపేసిన సిరీస్… భారీ వ్యూస్ తో పాటు వివాదాలు కూడా

OTT Movie : సినిమాలు, సిరీస్ లు చూసి చూసి విసిగిపోయారా? ‘స్క్విడ్ గేమ్’ లాంటి మైండ్ బెండింగ్ ట్విస్టులుండేలా ఏదైనా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ సిరీస్ మీకు పర్ఫెక్ట్. నిజానికి ఇదొక రియాలిటీ గేమ్ షో. ఉత్కంఠభరితమైన ఛాలెంజెస్, డైవర్స్ కంటెస్టెంట్స్, అదిరిపోయే డ్రామాతో వచ్చిన ఫిజికల్ ఫిట్‌నెస్ కాంపిటీషన్ ఇది. సింపుల్ గా చెప్పాలంటే స్ట్రెంగ్త్, స్టామినా, స్ట్రాటజీని టెస్ట్ చేస్తూ, Squid Game వంటి థ్రిల్‌ను ఇస్తుంది.


నెట్ ఫ్లిక్స్ ను ఓ ఊపు ఊపేసిన వివాదాస్పద షో
ఈ గ్రిప్పింగ్ షో పేరు Physical: 100. ఇదొక సౌత్ కొరియన్ రియాలిటీ కాంపిటీషన్ షో. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది. 2023లో సీజన్ 1, 2024లో సీజన్ 2 రిలీజ్ అయ్యాయి. రెండూ 9 ఎపిసోడ్‌లతో కొనసాగగా, జాంగ్ హో-గి దీనికి దర్శకత్వం వహించారు. సీజన్ 3 2025లో రానుంది. ఆసియా అంతటి నుండి కంటెస్టెంట్స్‌ పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ షో 192 మిలియన్ వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్ టాప్ నాన్-ఇంగ్లీష్ షోగా నిలిచింది. అలాగే ఈ షో వివాదాలను కూడా రేకెత్తించింది. ఒకరకంగా చెప్పాలంటే కొరియన్ బిగ్ బాస్… కానీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఆట.

స్టోరీ ఏంటంటే?
గేమ్ 100 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అవుతుంది. అథ్లెట్స్, మిలటరీ పర్సనల్, బాడీ బిల్డర్స్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇతర ప్రొఫెషనల్స్ ను తీసుకొని, వారి స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, బ్యాలెన్స్, ఎజిలిటీ, స్ట్రాటజీని పరీక్షిస్తారు. షో ప్రధాన లక్ష్యం “పర్ఫెక్ట్ ఫిజిక్”ను కనుగొనడం. ఇక విజేత సుమారు $230,000 డాలర్ల క్యాష్ ప్రైజ్‌ను గెలుచుకుంటాడు. ఈ కాంపిటీషన్ ఒక టోర్నమెంట్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఇందులో ప్రతి “క్వెస్ట్” తర్వాత కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు. ప్రతి కంటెస్టెంట్‌కు వారి టోర్సో ప్లాస్టర్ కాస్ట్ ఉంటుంది. ఎలిమినేట్ అయినప్పుడు వారు దానిని స్లెడ్జ్‌హామర్‌తో నాశనం చేయాలి.


సీజన్ 1 వివాదాస్పదం
సీజన్ 1లో 100 మంది కంటెస్టెంట్స్… అందులో 72 మంది పురుషులు, 28 మంది మహిళలతో షో మొదలవుతుంది. మొదటి ఛాలెంజ్ “ప్రీ-క్వెస్ట్”లో 100 మందిని రెండు గ్రూప్‌లుగా (50 చొప్పున) విభజించి, మెటల్ బార్‌పై వేలాడుతూ ఎంత సేపు ఉండగలరో పరీక్షిస్తారు. తర్వాతి క్వెస్ట్‌లో, కంటెస్టెంట్స్ ఒక బాల్‌ను పొందడానికి ఒకరితో ఒకరు “డెత్ మ్యాచ్”లో పోటీపడతారు. ఇందులో 50 మంది ఎలిమినేట్ అవుతారు. క్వెస్ట్ 2లో “మూవింగ్ శాండ్” 10 టీమ్‌లు ఇసుక సంచులను ఒక ట్యూబ్‌లో నింపడానికి పోటీపడతాయి. “పనిష్మెంట్ ఆఫ్ సిసిఫస్” క్వెస్ట్‌లో 100 కిలోల బండరాయిని కొండపైకి నెట్టాలి. ఫైనల్ క్వెస్ట్‌లో నలుగురు గేమ్‌లలో పోటీపడతారు. ఇందులో థగ్ -ఆఫ్-వార్, రోప్ పుల్ ఛాలెంజ్ లు ఉంటాయి. సీజన్ 1 ఫైనల్ గేమ్‌లో రీమ్యాచ్ ఆరోపణలు వివాదాన్ని రేకెత్తించాయి. సీజన్ 2 కూడా ఇలాగే ఉంటుంది. ఒక్కో సీజన్, అందులోని ఎపిసోడ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటే… ఖచ్చితంగా ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ గుర్తొస్తుంది. అదంటే రీల్… కానీ ఇది రియాలిటీ. కానీ థ్రిల్లింగ్ షో కావాలంటే, అందులోనూ కొరియన్ షో చూడాలంటే ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్.

Tags

Related News

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

OTT Movie : అర్ధరాత్రి వింత శబ్దాలు… మనుషులతో బలవంతంగా వికృత జీవి ఆ పని… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

OTT Movie : అమ్మ బాబోయ్… పండగ పేరుతో చావుమేళం… ఈ ఊరోళ్ళకి ఇదేం పాడు రోగం భయ్యా

OTT Movie : అమ్మాయిల్ని చంపేసి ఫ్రీజర్ లో దాచే సైకో… ఎక్స్ట్రీమ్ వయోలెన్స్… అవార్డు విన్నింగ్ అలాగే మోస్ట్ కాంట్రవర్షియల్

OTT Movie : వర్షం పడితే మూడ్ వచ్చే సైకో…. రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్

Big Stories

×