Pakistan Cricketer : ఇంగ్లాండ్ పై టీమిండియా 5వ టెస్ట్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పై పలువురు టీమిండియా బౌలర్ల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా బౌలర్లు బాల్ ట్యాంపర్ చేసేందుకు వాజిలిన్ రాసి ఉంటారని ఆరోపించారు. అందుకే 80 ఓవర్ల తరువాత కూడా బాల్ కొత్త దానిలా మెరుస్తూ ఉందన్నారు. అంపైర్లు ఆ బంతిని టెస్టుల కోసం ల్యాబ్ కి పంపాలన్నారు. చట్ట విరుద్ధమైన బౌలింగ్ తో ఏడాది నిషేదానికి గురైన నువ్వు ఆరోపణలు చేస్తున్నావా అని భారత ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.
Also Read : Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి
భారత్ విజయంలో బౌలర్లు కీలక పాత్ర
అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లోనూ సత్తా చాటాడు. తన కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు సిరాజ్ మియా. 674 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకి చేరుకున్నాడు. ఈ హైదరాబాదీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో టాప్ 15లో చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత ఫాస్ట్ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. ఓవల్ టెస్ట్ లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. చివరి టెస్ట్ లో సిరాజ్ తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్ కి మరుపురాని విజయాన్ని అందించాడు. మొత్తానికి ఈ సిరీస్ లో 23 వికెట్లతో సత్తా చాటాడు సిరాజ్.
మారు మ్రోగుతున్న సిరాజ్..
ముఖ్యంగా మూడు రోజుల నుంచి సిరాజ్ పేరు వార్తల్లో మారు మ్రోగిపోతుంది. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అతడిని పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఏ మాత్రం విజయావకాశాలు లేని పరిస్తితిలో జట్టును గెలిచిపించి ఈ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ పతాక శీర్షికలకు ఎక్కాడు. పదునైన బంతులతో ప్రత్యర్థుల పని పట్టి టీమిండియాకి చిరస్మరణీయమైన విజయాన్ని అందించడంలో కీరోల్ పోషించిన సిరాజ్ కి అన్ని వైపులా నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇంగ్లీషు గడ్డపై సత్తా చాటి తానేంటో మరోసారి రుజువు చేసి.. భళా అనిపించుకున్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ లో గ్రేడ్ ఏ ప్లేయర్ గా ఉన్నాడు. దీని ప్రకారం.. అతనికి రూ.5కోట్లు రూపాయల వార్షిక వేతనం అందుతుంది. రిటైనర్ తో పాటు అతడు ఆడే ప్రతీ మ్యాచ్ కి ఫీజు కూడా దక్కుతుంది. టెస్ట్ కి రూ.15లక్షలు, వన్డే కి రూ.6లక్షలు, టీ-20కి రూ.3లక్సల చొప్పున మ్యాచ్ ఫీజు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా బోనస్ కూడా అందుకోబోతున్నాడు. బాగా ఆడిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ బోనస్ ఇస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. టీమిండియా బౌలర్ల పై పాక్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.