Mahira Khan On IND VS PAK: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి తొమ్మిదో సారి చాంపియన్ అయింది భారత్. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడంపై పాకిస్తాన్ మాజీలు సెటైర్లు పేల్చుతున్నారు. తొండాట ఆడి టీమిండియా గెలిచిందని కొందరు అంటుంటే… ఫిక్సింగ్ జరిగిందని మరికొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రముఖ నటి మహిరా ఖాన్ సంచలన పోస్ట్ పెట్టారు.
టీమిండియాకు మూడ్ వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ జట్టును ఓడిస్తోందని ఫైర్ అయ్యారు. కావాలనే పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐసీసీ మ్యాచ్ లు నిర్వహించి… తమ పరువు తీస్తోందని ఫైర్ అయ్యారు. టీమిండియా జట్టుకు అంతర్జాతీయంగా పాపులారిటీ రావాలని పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించేలా కుట్రలకు తెరలేపుతున్నట్టు ఆమె పోస్ట్ పెట్టారు. టీమిండియా స్వార్థం కోసం పాకిస్తాన్ జట్టును కీలుబొమ్మగా మార్చి ఆడుకుంటున్నారని ఆగ్రహించారు. దీంతో మహిరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.