Inzamam ul Haq On Team India: అండర్ 19 ఛాంపియన్ ట్రోఫీతో (Under-19 Asia Cup 2026 Tournament Finals) పాటు కివీస్ గడ్డపై వన్డే సిరీస్ (India tour of New Zealand 2026 ) కైవసం చేసుకున్నాయి టీమిండియా జట్లు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఇండియా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ( Inzamam ul Haq ) కూడా టీమిండియాకు రెండు ట్రోఫీలు రావడంపై సంచలన ఆరోపణలు చేశాడు. అండర్ 19 ఆసియా కప్, కివీస్ గడ్డపై వన్డే సిరీస్ ట్రోఫీలు టీమిండియా జట్లు వరుసగా గెలవడంపై తనకు అనుమానాలు ఉన్నాయని బాంబు పేల్చాడు.
శనివారం రోజున జూనియర్ టీమిండియా.. ఆదివారం సీనియర్లు వన్డే సిరీస్ గెలవడం వెనుక భారత క్రికెట్ నియంత్రణ మండలి కుట్రలు ఉన్నాయన్నాడు. ఏదో స్కెచ్ వేసి మరీ రెండు ట్రోఫీలను బీసీసీఐ దక్కించుకుందని ఆరోపించాడు. లేకపోతే విదేశీ గడ్డలపై వరుసగా రెండు ట్రోఫీలు టీమిండియా గెలుచుకోవడం అంటే అసాధారణమైన విషయం అన్నాడు. దీంతోపై వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. తానే దీనిపై ఐసీసీకి లేఖ రాస్తానని కూడా హెచ్చరించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.
వీకెండ్ లో టీమిండియా రెండు ట్రోఫీలు దక్కడం వెనుక బీసీసీఐ కుట్రలు చేసిందని ఆరోపించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ( Inzamam ul Haq ).. దీనిపై వెంటనే ఐసీసీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం హైవే లాంటి మైదానాలపై ఆడే టీం ఇండియా జట్లు.. విదేశీ గడ్డలపై ఆడడం అసాధ్యమని తెలిపాడు. అయినప్పటికీ కివీస్ గడ్డపై సీనియర్లు.. ఒమన్ వేదికగా జూనియర్లు అద్భుతంగా రాణించి గెలిచారని తెలిపాడు.
అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ చివరి క్షణంలో మోహిత్ ఉల్వా ( Mohit Ulva) మ్యాజిక్ చేశాడని వెల్లడించాడు. అతని బ్యాట్ లో స్ప్రింగ్ లు ఉన్నాయని తమకు అనుమానంగా ఉందని బాంబు పేల్చాడు. అసలు బ్యాట్ సరిగ్గా పట్టుకోలేని మోహిత్.. ఎలా మ్యాచ్ గెలిపిస్తాడని ఆగ్రహించాడు. అటు న్యూజిలాండ్ గడ్డపై ఐదవ వన్డేలో ఓడిపోవాల్సిన టీమిండియా చివరి క్షణంలో గెలిచిందని తెలిపాడు. దీని వెనుక కూడా బీసీసీఐ ఉందని ఆరోపించాడు. ఈ రెండు అంశాలు కచ్చితంగా ఐసీసీ ( ICC) పరిగణలోకి తీసుకొని విచారణ చేయాలన్నాడు.