E-Paper
Advertisement

మా వెధ‌వలు ముందు గెలికారు..అందుకు టీమిండియా కుర్రాళ్లు దూల తీర్చారు

మా వెధ‌వలు ముందు గెలికారు..అందుకు టీమిండియా కుర్రాళ్లు దూల తీర్చారు
Advertisement

Ahmed Shahzad On India U-19 celebrations Asia Cup: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో (Under-19 Asia Cup 2026 Tournament Finals) టీమిండియా సూపర్ విక్టరీ అందుకున్న సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు పోరాడిన టీమిండియా… పాకిస్తాన్ జట్టును ఓడించి తొమ్మిదో సారి ఛాంపియన్ గా నిలిచింది. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా కుర్రాళ్ళు అగ్రెసివ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లను రెచ్చగొడుతూ.. రచ్చ రచ్చ చేశారు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీలు ఆదివారం ఉదయం నుంచి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ టీమిండియా కుర్రాళ్లపై విమర్శలు చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్ల పై బ్యాన్ విధించాలని కోరుతున్నారు.

టీమిండియా కుర్రాళ్ల ఆవేశంలో త‌ప్పేం లేదు – అహ్మద్ షెజాద్

టీమిండియా కుర్రాళ్ల‌ సెలబ్రేషన్స్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెజాద్ కూడా తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. ఈ సెలబ్రేషన్స్ పై తాను టీమిండియా క్రికెటర్లను విమర్శించదలుచుకోలేదని స్పష్టం చేశాడు. ముందు తమ వెధవలే టీమిండియా ప్లేయ‌ర్ల‌ను రెచ్చగొట్టారని.. అందుకే ఫైనల్ గెలిచిన తర్వాత దూల తీర్చారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గ్రూప్ స్టేజ్ లో గెలిచిన తర్వాత పేపర్ నోట్ సెలబ్రేషన్స్ చేసి పాకిస్తాన్ వికెట్ కీపర్ హంజా జహూర్ (Hamza Zahoor) స్టేడియంలో రచ్చ చేశాడని గుర్తు చేశాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

ఆ సమయంలో టీమిండియా క్రికెటర్లను కూడా పాకిస్తాన్ కుర్రాళ్ళు రెచ్చగొట్టిన విషయం తనకు తెలుసు అన్నాడు. అయితే వాటిని మనసులో పెట్టుకున్న టీమిండియా కుర్రాళ్ళు… ఫైనల్ గెలిచి.. తమ వాళ్ళ దూల తీర్చారని వ్యాఖ్యానించాడు. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా టీమిండియా క్రికెట‌ర్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారని తెలిపారు. ఇందులో టీమిండియా జూనియ‌ర్ల తప్పేం లేదని కుండబద్దలు కొట్టి చెప్పాడు. అనవసరంగా కొంత మంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహించాడు. మ్యాచ్ ఓడిపోయిన అంశాన్ని పక్కకు పెట్టి, ఈ వివాదం పైనే గొడవ పడడం డైవర్షన్ కిందకు వస్తుందని తెలిపాడు. ముందు పాకిస్తాన్ ఓటమి కారణాలను వెలికి తీయాలి అంటూ కౌంటర్ ఇచ్చాడు.

టీమిండియాపై ఐసీసీకి ఫిర్యాదు!

Advertisement

ఇది ఇలా ఉండగా… ఆసియా కప్ అండర్ 19 ట్రోఫీ గెలిచిన తర్వాత టీమిండియా కుర్రాళ్ళు చేసిన సెలబ్రేషన్స్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియ‌స్ అయినట్టు తెలుస్తోంది. వెంటనే అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అన్ని ఆధారాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

య‌శ్వీర్ గౌడ్ ను చెప్పుల‌తో కొట్టాలి…పాకిస్తాన్ మాజీ మంత్రి సంచ‌ల‌నం!

2 రోజుల్లో రెండు ట్రోఫీలా? ఫిక్సింగ్ చేసి గెలిచారంటూ ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

తెలంగాణ ప‌వ‌ర్ ఏంటో చూపించాడు..యశ్వీర్ గౌడ్ ను మెచ్చుకున్న ఇర్ఫాన్ ప‌ఠాన్

ఒకే ఒక్క నిర్ణయం.. 700 మంది క్రీడాకారుల జీవితాలను మార్చేసింది!

టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ కు బంప‌ర్ ఆఫ‌ర్

పాకిస్తాన్ బౌలర్ల‌ను చూస్తేనే ప్యాంట్లు త‌డుపుకునేవారు..కానీ ఇప్పుడు టెయిలెండ‌ర్లే ఉతికారేశారు

‘సీతారాం’ జపం చేసి, పాకిస్తాన్ ను ఓడించా…ఆర్య‌వీర్ సెహ్వాగ్ వీడియో వైర‌ల్

Big Stories

Advertisement
×