Shoaib Akhtar On U 19 Asia Cup 2026: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో (Under-19 Asia Cup 2026 Tournament Finals) టీమిండియా విజేతగా నిలిచింది. చివరి వరకు పోరాడిన టీమిండియా… పాకిస్తాన్ జట్టును చిత్తు చేసి, విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడంపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకప్పుడు పాకిస్తాన్ బౌలర్లను తలుచుకుంటేనే టీమిండియా ఆటగాళ్లు ప్యాంట్లు తడుపుకునే వాళ్లు అంటూ వ్యాఖ్యానించిన షోయబ్ అక్తర్… నిన్న మాత్రం తమ పాకిస్తాన్ బౌలర్లను భారత టెయిలెండర్లే ఉతికి పారేసారని పేర్కొన్నాడు.
పాకిస్తాన్ బౌలింగ్ పరమ చెత్తగా తయారైందని.. అందుకే 11వ స్థానంలో వచ్చిన బ్యాటర్లు కూడా సిక్సర్లు, బౌండరీలు అవలీలగా కొట్టగలుగుతున్నారని చురకలు అంటించాడు. చెత్త బౌలింగ్ ప్రదర్శన చేసి, పాకిస్తాన్ పరుగులు తీసారని ఆగ్రహించాడు. చేతులోకి వచ్చిన మ్యాచ్ ను భారత బౌలర్లు అవలీలగా గెలిపించుకున్నారని ప్రశంసించాడు. మోహిత్ ఉల్వా బ్యాటింగ్ ఎవరు మర్చిపోలేరని.. అత్యంత భయంకరమైన ఇన్నింగ్స్ ఆడినట్టు మెచ్చుకున్నాడు.