Gundeninda Gudigantalu Meena : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది.. అందులో ముఖ్యంగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ అయితే ఎంత క్రేజ్ ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ సీరియల్ లోని హీరో హీరోయిన్ల మధ్య కన్వర్జేషన్ హైలెట్గా నిలవడంతో ఎక్కువ మంది జనాలు వాళ్లిద్దరిని చూడడానికే సీరియల్ చూస్తారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తెలుగు సీరియల్స్ ద్వారా మీనా ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా అంటూ తన లేటెస్ట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వస్తుంది.. అయితే మీనా నెలకు ఎంత సంపాదిస్తుంది అన్న ప్రశ్న రోజు రోజుకి అభిమానులు పెరుగుతూ వస్తుంది.. మరి మీనా సోషల్ మీడియా ద్వారా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం…
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముద్దుగుమ్మ మీనా… ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి. అయినా కూడా తెలుగు అమ్మాయిలాగా ఆమె నటించిన ప్రతి సీరియల్ కూడా కనిపించడంతో అభిమానులు పెరుగుతూ వచ్చారు.. ఇటీవల కాలంలో ఈమె నటించిన సీరియల్స్ భారీ విషయాన్ని సొంతం చేసుకోవడంతో మీనా అలియాస్ అమూల్య గౌడ కు తెలుగు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.. సోషల్ మీడియాలో మీనా పోస్ట్లు గనుక వస్తే లైక్ లు షేర్లతో ఇంకాస్త ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.. ఈ మధ్యకాలంలో మీనా సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. నెలకు ఈమె సోషల్ మీడియా ద్వారా 16 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఓ వార్త సోషల్ మీడియాలోనే షికారు చేస్తుంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే అమూల్య రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే..
?rpxt=cWc0NjBqdGdwenVr
బెంగళూరు ముద్దుగుమ్మలకి బోలెడు డిమాండ్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కర్ణాటక కు సంబంధించిన సీరియల్ హీరోయిన్ లకు తెలుగులో మంచి క్రేజ్ తో పాటుగా డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ మధ్య ఏ సీరియల్ కనిపించినా కూడా కన్నడ హీరోయిన్లే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో సీరియల్ లో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తున్నారు. గత కొద్దిరోజులుగా అమూల్య కార్తీకదీపం సీరియల్ నుంచి గుండె నిండా గుడి గంటల వరకు బాగా పేరు సంపాదించుకుంది.. ఒక్కో సీరియల్ తో ఒక్కో విధమైన క్రేజ్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు అటు కన్నడలో కూడా పలు సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ వస్తుంది. అయితే ఇకమీదట తెలుగులో ఎలాంటి సీరియల్లో నటిస్తుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..