E-Paper
Advertisement

టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ కు బంప‌ర్ ఆఫ‌ర్

టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ కు బంప‌ర్ ఆఫ‌ర్
Advertisement

PCB Chairman Mohsin Naqvi: ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ 2026 లో (2026 Under-19 Asia Cup Tournament) భాగంగా టీమిండియా చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ను ఓడించిన టీమ్ ఇండియా తొమ్మిదవ సారి టైటిల్ దక్కించుకుంది. ఈ మ్యాచ్ ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్థాన్ జ‌ట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండగా… ఇండియాను మెచ్చుకుంటూ కొంత మంది పోస్టులు పెడుతున్నారు. అయితే పాకిస్తాన్ జట్టు ఓడిపోయిన నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ సంచలన ప్రకటన చేశాడు. జట్టు ఓడిపోయినప్పటికీ తమ క్రికెట్ సభ్యులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన విడుదలైనట్టు వార్తలు వస్తున్నాయి.

9వ సారి టైటిల్ విజేతగా టీమిండియా

అండర్ 19 వన్డే ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో అందరూ ఊహించినట్టుగానే యువ భారత్ చాంపియన్‌గా నిలిచింది. ఒమన్ వేదికగా శనివారం అండర్ 19 పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ పోరులో ఒకే ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి బంతి వరకు పోరాడిన టీమిండియా, పాకిస్తాన్‌ను మట్టి కరిపించింది. పాకిస్తాన్‌ను ఓడించిన అండర్ 19 భారత జట్టు.. 9వ సారి టైటిల్ విజేతగా నిలిచింది.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించిన టీమిండియా

పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు లక్ష్య రాజేశ్ (80), ఆర్యవీర్ సెహ్వాగ్ (58) మెరుపులు మెరిపించారు. 95 పరుగుల వరకు వికెట్ పడకుండా జట్టును ముందుకు నడించారు. ఆ తర్వాత ఓపెనర్లు ఔట్ కావడంతో పాకిస్తాన్ చేతుల్లోకి మ్యాచ్ వెళ్లింది. ఇలాంటి తరుణంలో మనల్ చౌహాన్ (47), మోహిత్ ఉల్వా (49) పరుగులు చేసి భారత జట్టును గెలిపించారు. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన దశలో మోహిత్ ఉల్వా బౌండరీ బాది ఇండియాను చాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ క్రమంలోనే ఉల్వాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండర్ 19 వన్డే ఆసియా కప్ 2026లో లీడింగ్ స్కోరర్‌గా నిలిచిన ఆర్యవీర్ సెహ్వాగ్ (361) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకున్నాడు.

Advertisement

9వ సారి చాంపియన్‌గా భారత్

పాకిస్తాన్‌పై గెలిచిన భారత్.. 9వ సారి చాంపియన్‌గా నిలిచింది. టోర్నమెంట్ ప్రారంభమైన 1989లోనే తొలిసారి భారత్ ట్రోఫీ అందుకుంది. 2003, 2012, 2014, 2016, 2018, 2019, 2021, 2026లలో చాంపియన్‌గా నిలిచింది. అంటే దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత చాంపియన్‌గా భారత్ నిలిచింది. పాకిస్తాన్, బంగ్లా రెండు సార్లు ట్రోఫీ అందుకోగా, ఆఫ్గాన్ ఓ సారి చాంపియన్ అయింది.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

పాకిస్తాన్ బౌలర్ల‌ను చూస్తేనే ప్యాంట్లు త‌డుపుకునేవారు..కానీ ఇప్పుడు టెయిలెండ‌ర్లే ఉతికారేశారు

‘సీతారాం’ జపం చేసి, పాకిస్తాన్ ను ఓడించా…ఆర్య‌వీర్ సెహ్వాగ్ వీడియో వైర‌ల్

భార‌తీయ‌ త‌ల్లిదండ్రుల పెంప‌క‌మే స‌రిగ్గా లేదు..అందుకే వీధి రౌడీల్లా రెచ్చిపోయారు

ఇంత దుర్మార్గమా? ఆసియా క‌ప్ ఇవ్వ‌కుండా న‌ఖ్వీని జై షానే అడ్డుకున్నాడు

భార‌త క్రికెట‌ర్ల‌ మెద‌ళ్ల‌లో విషం నిప్పులుతున్నారు..అందుకే మృగాళ్ల‌లాగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు

అండర్ 19 ఆసియా కప్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ ఎందుకు ఇవ్వలేదంటే?

హంజాపై టీమిండియా ప్లేయర్ దాడి? స్టేడియం నుంచి పారిపోయిన పాక్ ఆటగాళ్లు

Big Stories

Advertisement
×