Irfan Pathan On Yashveer Goud Celebrations: ఆసియా కప్ అండర్ 19 వన్డే టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 Tournament Finals) నేపథ్యంలో టీమిండియా చాంపియన్ గా నిలిచింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్ల ముందు మనోళ్లు చేసిన సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్ వికెట్ కీపర్ హంజా జహూర్ (Hamza Zahoor) ముందు తెలంగాణ కుర్రాడు యశ్వీర్ గౌడ్ (Yashveer Goud Celebrations) చేసిన సెలబ్రేషన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అయితే దీనిపై పాకిస్తాన్ మాజీలు మండిపడుతున్న నేపథ్యంలో… యశ్వీర్ గౌడ్ కు మద్దతుగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ నిలిచాడు. హిందుస్థాన్ పవర్ ఏంటో పాకిస్తాన్ వాడికి యశ్వీర్ గౌడ్ చూపించాడని వ్యాఖ్యానించాడు. యశ్వీర్ గౌడ్ స్థానంలో తాను ఉండి ఉంటే రెండు చెంపలు వాయించే వాడినని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. గ్రూప్ స్టేజిలో ఇండియాను ఓడించిన తర్వాత హంజా జహుర్… మనోళ్లను రెచ్చగొట్టాడని అందుకే వాడిపై యశ్వీర్ గౌడ్ ప్రతీకారం తీర్చుకున్నట్టు వ్యాఖ్యానించాడు. ఇందులో యశ్వీర్ గౌడ్ తప్పేం లేదని స్పష్టం చేశాడు ఇర్ఫాన్ పఠాన్. దీంతో యశ్వీర్ గౌడ్ పై ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ 2026 (Under-19 Asia Cup 2026 Tournament Finals) విజేతగా టీమిండియా జూనియర్లు నిలిచారు. ఫైనల్ మ్యాచ్ శనివారం జరగగా.. ఇందులో పాకిస్తాన్ పై ఒకే ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన టీమిండియా జూనియర్లు 9వ సారి ఛాంపియన్ గా నిలిచారు. ఇక ఇవాళ అంటే ఆదివారం న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (New Zealand vs India, 5th ODI) మధ్య ఐదు వన్డేల సిరీస్ (India tour of New Zealand 2026 ) ఫైనల్ మ్యాచ్ జరిగింది.
కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) సేన సూపర్ విక్టరీ అందుకుంది. చివరి వరకు పోరాడి కివీస్ గడ్డపై 22 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ క్రమంలోనే 3-1 తేడాతో వన్డే సిరీస్ కూడా దక్కించుకుంది. దీనిపై కూడా ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) రియాక్ట్ అయ్యాడు. వరుసగా రెండు రోజుల్లో రెండు ట్రోఫీలు టీం ఇండియాకు దక్కయని మెచ్చుకున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ కూడా ఇలాగే గెలవాలని టీమ్ ఇండియాకు ( Team India) సూచనలు చేశాడు.