Fawad Chaudhry On Yashveer Goud Celebrations: ఆసియా కప్ అండర్ 19 2026 టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 Tournament Finals) విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసిన టీమిండియా జూనియర్ జట్టు… తొమ్మిదవ సారి టైటిల్ అందుకుంది. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్లు గ్రౌండ్ లో రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా యశ్వీర్ గౌడ్ (Yashveer Goud Celebrations)… పాకిస్తాన్ వికెట్ కీపర్ హంజా జహూర్ (Hamza Zahoor) ముందుకు వెళ్లి అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసి రెచ్చగొట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
అయితే తాజాగా ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి (Fawad Chaudhry)
వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ యశ్వీర్ గౌడ్ కు కొంచెం కూడా బుద్ధి లేదని.. బుర్ర తక్కువ వెధవలాగా ప్రవర్తించాడని మన్నిపడ్డాడు. అతనికి వెంటనే తల్లి ప్రేమతో పాటు తండ్రి చెప్పు దెబ్బలు కొట్టాలని హాట్ కామెంట్స్ చేశాడు. అతని తండ్రి కొట్టకపోతే, తాము కొడతామంటూ హెచ్చరించాడు. అప్పుడే యశ్వీర్ గౌడ్ కు సిగ్గు వస్తుందని మండిపడ్డాడు. పాకిస్తాన్ ఆటగాళ్లపైకి వచ్చిన అతనిపై వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
క్రికెట్ అన్నాక గెలుపు, ఓటములు సహజమేనని… కానీ ఒక్క విజయానికే టీమిండియా కుర్రాళ్ళు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశ్నించాడు. ఆసియా కప్ 2026 అండర్ 19 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన సంఘటనలపై వెంటనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ హంజా జహూర్ (Hamza Zahoor)ను రెచ్చగొట్టిన యశ్వీర్ గౌడ్ మళ్ళీ క్రికెట్ ఆడకుండా చేయాలని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు మైదానంలో అడుగుపెట్టకుండా కఠినమైన శిక్ష వేయాలని కోరాడు.
అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని తెలిపాడు. ఆ దిశగా మొహ్సిన్ నఖ్వీ కూడా ప్రయత్నాలు చేయాలని పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సూచనలు చేశాడు. అయితే పాకిస్తాన్ మాజీ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి (Fawad Chaudhry) చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ అదే స్టైల్ లో కౌంటర్ ఇస్తున్నారు. ముందుగా గ్రూప్ స్టేజిలో పాకిస్తాన్ కుర్రాళ్లే తమను రెచ్చగొట్టారని ఫైర్ అవుతున్నారు. వాళ్లు రెచ్చగొట్టినందుకే టీమిండియా కుర్రాళ్ళు ఫైనల్ మ్యాచ్ లో అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందని వీడియోలు, పోస్టులు పెడుతున్నారు.