Mark Taylor-kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తరచూ భారత్ గురించి చెడుగా మాట్లాడే పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా విరాట్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. కోహ్లీ ఆటతీరుకు, అతడి దూకుడైన స్వభావానికి ఇట్టే అతడి అభిమానులు అయిపోతుంటారు.
Also Read: SRH -Kavya Maran: హైదరాబాద్ ఓనర్ కావ్య పాపకు డబ్బులు ఎలా వస్తాయి.. ఇంతలా ఎలా సంపాదిస్తోంది?
కోహ్లీని అభిమానించే వారిలో సాధారణ వ్యక్తులే కాకుండా మాజీ క్రికెటర్లు కూడా ఎంతోమంది ఉన్నారు. వీరిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా ఒకరు. మార్క్ టేలర్ కి విరాట్ కోహ్లీ అంటే ఎంత అభిమానం అంటే ఏకంగా తన కూతురిని విరాట్ కోహ్లీకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని కూడా అనుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా మార్క్ టేలర్ వివరించారు. గతంలో విరాట్ కోహ్లీతో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని తాజాగా పంచుకున్నారు మార్క్ టేలర్.
ఇలా టేలర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసాయి. ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్సా హీలి నిర్వహిస్తున్న “విల్లో టాక్” అనే పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మార్క్ టేలర్.. విరాట్ కోహ్లీతో తన తొలి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. విరాట్ కోహ్లీ తనకి పరిచయమైన సందర్భంలో అతడి ప్రవర్తన, వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నాడు టేలర్.
విరాట్ కోహ్లీ గురించి మార్క్ టేలర్ మాట్లాడుతూ.. “భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తొలి రోజులలోనే కోహ్లీని కలిశాను. నాకు అడిలైడ్ లోని ఓవల్ లో అతడిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. కానీ విరాట్ కోహ్లీ నాకు కేవలం అరగంట సమయం మాత్రమే కేటాయించాడు. ఆ ఇంటర్వ్యూ అనంతరం విరాట్ కోహ్లీని అతడి మేనేజర్ వచ్చి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించాడు. అప్పుడు కోహ్లీ.. ” మీరు అడగాల్సిన ప్రశ్నలు అయిపోయాయా..? ” అని నన్ను ప్రశ్నించారు.
దానికి నేను ఇంకా అవ్వలేదు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు కోహ్లీ నాపై గౌరవంతో మరికొంత సమయం కేటాయించాడు. ఆ సందర్భంలో అతడిలోని వినయం, పెద్దలపట్ల గౌరవం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో నా కూతురి వయసు 17 సంవత్సరాలు. నేను నా కూతురిని విరాట్ కోహ్లీకి పరిచయం చేశాను.
అనంతరం కోహ్లీని.. నీకు ఇష్టమైతే నా కూతురిని వివాహం చేసు కోవచ్చు అని సరదాగా అన్నాను. దీంతో నా మాటల కు నా కూతురు సిగ్గుతో తలదించుకుంది. ఆ సమయంలో విరాట్ కి ఇంకా వివాహం కాలేదు. అతడి వ్యక్తిత్వం చూసి ఎవరైనా ఇష్టపడతారు. ఒక గొప్ప ఆటగాడిలో ఉండాల్సిన లక్షణాలు అన్నీ కోహ్లీలో ఉన్నాయి. అందుకే నేను అలా సరదాగా వ్యాఖ్యానించాను”. అని చెప్పుకొచ్చాడు మార్క్ టేలర్.