Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండా కాలంలో వర్షాలు దంచికొట్టగా.. ఇప్పుడు వానలు కరువయ్యాయి. దీంతో ఏపీ, తెలంగాణ రైతులు వరుణ దేవుడి వైపు చూస్తున్నారు. రెండు వారాల క్రితం రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయిపోగా.. ప్రస్తుతం ఏం పనులు లేక ఖాళీగా ఉన్న పరిస్థితి నెలకొంది.
ఈ 13 జిల్లాలకు భారీ వర్షం
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ తో పాటు 13 జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. అక్కడక్కడా పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని చెప్పారు. దీంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం
ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని వివరించారు. అలాగే హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు. రాబోయే 24 గంటల్లో భాగ్యనగరంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.
ALSO READ: Revanth Vs Ktr: రేవంత్ రెడ్డిది పౌరుషం… కేటీఆర్ ది పొగరు
ఏపీలో భారీ వర్షం.. పిడుగులు పడే ఛాన్స్
అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా రేపు భారీ వర్షాలు పడనున్నాయి. రేపు మన్యం, అల్లూరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ALSO READ: CM Revanth Reddy: దేశంలోనే తెలంగాణ నంబర్ వన్.. ఇదికదా ప్రజా ప్రభుత్వం అంటే: సీఎం రేవంత్
ఈ 24 రాష్ట్రాల్లో భారీ వర్షం..
అలాగే పలు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు 24 రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. కర్నాటక, గోవా, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్ గఢ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్ఛేరి, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, ఏపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.