E-Paper

Ashwin: పాకిస్తాన్ పై గెలిచినా, వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ అవుతుంది !

Ashwin: పాకిస్తాన్ పై గెలిచినా, వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ అవుతుంది !
Advertisement

Ashwin:  మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament) నేపథ్యంలో నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Women vs Pakistan Women) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా , పాకిస్తాన్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో వరల్డ్ కప్ టోర్నమెంటులో శుభారంభం చేసింది టీమిండియా. ఇదే ఊపుతో ముందుకు వెళ్లి వరల్డ్ కప్ కూడా గెలవాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే పాకిస్తాన్ పైన గెలిచిన టీమ్ ఇండియాపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (RAVICHANDRAN ASHWIN) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ గెలిచే సత్తా టీమిండియాలో లేదని బాంబు పేల్చారు. అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ టీమిండియాకు లేకపోవడం వల్ల.. వరల్డ్ కప్ నుంచి గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అశ్విన్.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

పాకిస్తాన్ పై గెలిచినా, టీమిండియా ఎలిమినేట్ అవుతుంది !

Advertisement

టీ20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో (ICC Women’s T20 World Cup 2026 tournament) పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రవిచంద్రన్ అశ్విన్. పాకిస్తాన్ పైన గెలిచినంత మాత్రాన వరల్డ్ కప్ కొట్టలేమని బాంబు పేల్చారు. టి20 ఫార్మట్ కు తగ్గట్టుగా టీమిండియా బ్యాటర్లు ఆడడం లేదని హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న జట్టుతో టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లడం కూడా కష్టమేనని తెలిపారు. గ్రూప్ స్టేజ్ లో దక్షిణాఫ్రికా అలాగే ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లతో టీమిండియా ఆడాల్సి ఉందని.. వాళ్లను ఎదిరించాలంటే అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ ఉండాలంటూ సూచనలు చేశారు.

ఈ రెండు జట్ల‌పైన టీమిండియా గెలిస్తేనే ముందుకు సాగుతుందని.. లేకపోతే గ్రూప్ లోనే ఎలిమినేట్ కావడం గ్యారంటీ అన్నారు. అయితే ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతంగా రాణించాలంటే పవర్ ప్లే లో 60 కి పైగా పరుగులు సాధించాలని సూచనలు చేశారు. షెఫాలీ వర్మ త్వరగా ఔట్ కాకుండా పవర్ ప్లే అయిపోయే వరకు ఉండాలని వెల్లడించారు. స్మృతి మందాన మరింత బాధ్యత తీసుకొని మ్యాచ్ ఆడాలని కోరారు. జెమీమా వన్డేలకు తప్ప టి20లకు పనికిరాదని.. ఆమె పెద్ద హిట్టర్ కూడా కాదంటూ బాంబు పేల్చారు. అందుకే టీమిండియా అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ పైన దృష్టి పెట్టాలని వెల్లడించారు. అప్పుడే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలుస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

Related News

Cooper Gifts Bike to Litton Das: కూపర్ గొప్ప మ‌న‌సు..లిట‌న్ దాస్ కు బైక్ గిఫ్ట్

మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

టీమిండియాలో అంద‌రూ మ‌గాళ్లే…ఛీటింగ్ చేసి, పాకిస్తాన్ ను ఓడించారు

అంపైర్ల ముందే త‌న్నుకున్న ప్లేయ‌ర్లు…ఆగిపోయిన ఇండియా, పాక్ మ్యాచ్ !

ఇదెక్కడి మాస్ డాన్స్ రా మామ…మ‌నోళ్ల ర్యాగింగ్ చూస్తే ఫాతిమా ఉరేసుకోవ‌డం గ్యారెంటీ

IND VS PAK: కొంప‌ముంచిన క్యాచ్ మిస్‌…టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌

రోహిత్ శ‌ర్మ ర‌నౌట్ వెనుక గంభీర్‌, గిల్ కుట్ర‌లు, సెహ్వాగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

×