E-Paper
Advertisement

ఫోల్డబుల్ ఫోన్ల రూట్ మార్చిన శాంసంగ్.. ఈసారి రాబోతున్న 3 కొత్త మోడల్స్ ఇవే!

ఫోల్డబుల్ ఫోన్ల రూట్ మార్చిన శాంసంగ్.. ఈసారి రాబోతున్న 3 కొత్త మోడల్స్ ఇవే!
Advertisement

Samsung Unpacked 2026: శాంసంగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ల సందడి మొదలైంది. వచ్చే నెల లండన్‌లో జరగబోయే అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ తమ తదుపరి తరం ఫోల్డబుల్ మొబైల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈసారి కేవలం అప్‌గ్రేడ్‌లు మాత్రమే కాకుండా.. డిజైన్ పరంగా కూడా శాంసంగ్ కొన్ని కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు గట్టిపోటీ ఇచ్చేలా ఒక సరికొత్త మోడల్‌ను కూడా తీసుకురాబోతోంది.

వచ్చే నెలలోనే గ్రాండ్ ఎంట్రీ..

గత రికార్డులను బట్టి చూస్తే.. శాంసంగ్ జులై 22న లండన్ వేదికగా ఈ కొత్త ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈవెంట్ జరిగిన కొన్ని వారాల్లోనే ఇవి మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. ఈసారి శాంసంగ్ తమ ఫోన్ల పేర్లలో కూడా కాస్త మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మూడు వేర్వేరు మోడల్స్ వస్తుండటంతో, యూజర్లకు గందరగోళం లేకుండా ఉండేందుకు కొత్త నేమింగ్ స్ట్రాటజీని వాడుతోంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత చౌకైన ధరకే Poco C85 5G ఫోన్.. ఆఫర్ వివరాలు ఇవే!

అల్ట్రా లుక్‌లో మెయిన్ ఫోన్..

గతేడాది వచ్చిన మోడల్‌కు కొనసాగింపుగా ఈసారి Galaxy Z Fold 8 Ultra మార్కెట్లోకి రానుంది. దీని పేరులోనే అల్ట్రా ఉండటంతో ఫీచర్లు కూడా నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. ఇది కేవలం 4.1 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. 200MP ప్రధాన కెమెరాతో పాటు 5000mah బ్యాటరీ, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ అలరించనుంది.

పాస్‌పోర్ట్ స్టైల్‌లో కొత్త మోడల్..

Advertisement

ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ Galaxy Z Fold 8. దీనిని గెలాక్సీ జెడ్ ఫోల్డ్ వైడ్ అని కూడా పిలుస్తున్నారు. ఇది చూడటానికి పాస్‌పోర్ట్ ఆకారంలో, వెడల్పాటి స్క్రీన్‌తో సరికొత్తగా ఉంటుంది. రాబోయే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌కు పోటీగా శాంసంగ్ దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. దీనిలో 50MP కెమెరాతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌ను అందిస్తున్నారు.

ఫ్లిప్ లవర్స్ కోసం జెడ్ ఫ్లిప్ 8..

చిన్నగా, స్టైలిష్‌గా ఉండే ఫోన్లు ఇష్టపడే వారి కోసం Galaxy Z Flip 8 వస్తోంది. డిజైన్ పరంగా పాత మోడల్‌లానే ఉన్నప్పటికీ.. ఇది మరింత స్లిమ్‌గా మారబోతోంది. దీనిలో పెద్ద కవర్ డిస్‌ప్లేతో పాటు మెరుగైన బ్యాటరీ లైఫ్ ఉండనుంది. ఈ ఫోన్లన్నింటిలో గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే విడిభాగాల ఖర్చులు పెరగడం వల్ల ధరలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లతో పాటే కొత్త గెలాక్సీ వాచ్‌లను కూడా శాంసంగ్ లాంచ్ చేయనుంది.

Also Read: జియో యూజర్లు ఫుల్ హ్యాపీ.. ఏడాది పొడవునా రోజుకు 2.5GB డేటా, ఉచితంగా గూగుల్ జెమిని AI, హాట్‌స్టార్!

Related News

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్‌లోనే లైవ్ టీవీ!

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

Big Stories

Advertisement
×