E-Paper
Advertisement

Saqlain Mushtaq : మిస్ట‌ర్ బ్రూక్‌..పిచ్ ఫోటో ముందే తీసుకో..లేక‌పోతే టీమిండియా గోల్ మాల్ చేస్తుంది

Saqlain Mushtaq : మిస్ట‌ర్ బ్రూక్‌..పిచ్ ఫోటో ముందే తీసుకో..లేక‌పోతే టీమిండియా గోల్ మాల్ చేస్తుంది
Advertisement

Saqlain Mushtaq :  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో భాగంగా ఇవాల్టి నుంచి సెమీ ఫైనల్ షురూ కానుంది. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( South Africa vs New Zealand) మధ్య మొదటి సెమీ ఫైనల్ నిర్వహించనున్నారు. రేపు టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England) మధ్య రెండో సెమీ ఫైనల్ ఉండనుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు సెమీ ఫైనల్స్ కోసం ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ ( Saqlain Mushtaq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఏదైనా చేసి గెలిచే ప్రమాదం పొంచి ఉందని బాంబు పేల్చారు. పిచ్ మార్పిడి చేసే అవకాశాలు కూడా ఉంటాయని వెల్లడించారు.

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

పిచ్ ఫోటో ముందే తీసుకో.. ఇంగ్లాండ్ కెప్టెన్ కు సూచనలు

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ముంబై వాంఖ‌డే ( Mumbai Wankhede  Stadium) వేదికగా టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ 2 జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ ( Saqlain Mushtaq )  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సెమీ ఫైనల్ లో టీమిండియా గెలిచేందుకు ఎలాంటి కుట్రలకైనా తెర లేపుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై వాంఖ‌డే స్టేడియానికి సంబంధించిన పిచ్ ( Pitch) ఫోటోను ముందే ఫోటో తీసుకోవాలని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ( Harry Brooke ) సూచనలు చేశారు సైక్లైన్‌ ముస్తాక్. లేకపోతే మ్యాచ్ ఓడిపోయే సమయంలో పిచ్ మొత్తం మార్చేస్తారని ఇండియాపై ఆరోపణలు చేశారు. అప్పుడు ఇంగ్లాండ్ ఓడిపోయి టీం ఇండియా గెలిచే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కాబట్టి హ్యారీ బ్రూక్ చాలా జాగ్రత్తగా ఉండి పిచ్ కు సంబంధించిన ఫోటోలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇండియన్ ఎప్పుడూ నమ్మరాదని.. వాళ్లు అంపైర్లను కొనుగోలు చేసి మ్యాచ్ గెలుస్తారని కూడా ఆరోపించారు.

అభిషేక్ శర్మ అవుట్.. సంజు పై నిషేధం

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు చెబుతున్నారు. సరిగ్గా ఫామ్ లేని అభిషేక్ శర్మ పై వేటు వేసి రింకూ సింగ్ తెరపైకి తీసుకువస్తున్నారట. అటు వెస్టిండీస్ పై విజయం సాధించిన తర్వాత వివాదాస్పదంగా సెలబ్రేషన్స్ చేసుకున్న సంజు శాంస‌న్‌ పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధించే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఈ యాక్షన్ తీసుకోనున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement

Also Read: Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×