BigTV English

Memes on RCB : RCBకి ఇదేం కర్మ రా.. కప్పు రావడం లేదని..వెల్డింగ్ షాప్ లో చేసుకున్నారు

Memes on RCB :  RCBకి ఇదేం కర్మ రా.. కప్పు రావడం లేదని..వెల్డింగ్ షాప్ లో చేసుకున్నారు

Memes on RCB :  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి చాలా సీజన్ లలో కూడా ఇలాంటి ప్రదర్శన కనబరిచిన తరువాత ఈ జట్టు ఫైనల్ వరకు వెళ్లి రెండు సార్లు టైటిల్ ను కోల్పోయింది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే..? రెండు సార్లు ఫైనల్ కి వెళ్తే రెండు సార్లు కూడా హైదరాబాద్ జట్టే విజయం సాధించడం విశేషం. 2009 లో డెక్కన్ ఛార్జర్స్.. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించాయి. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవకపోవడం గమనార్హం.


2007 నుంచి ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించని జట్లలో ఆర్సీబీ ముందుంటుందనే చెప్పాలి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆర్సీబీ పై మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆర్సీబీకి కప్ రాలేదని ఓ వెల్డింగ్ షాపు లో కప్ తయారు చేసి సంబురాలు చేసుకుంటున్నారని మీమ్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఈ సీజన్ లో ఆర్సీబీకి కప్ వస్తుందని దాదాపు అందరూ భావిస్తున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు కూడా విజృంభిస్తోంది. ప్రస్తుతం ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఢిల్లీ, లేదా ముంబై, గుజరాత్ టైటాన్స్ లో ఏదైనా ఒక జట్టు విజయం సాధిస్తే.. ఆర్సీబీ టాప్ ప్లేస్ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. 

ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్ లకు 7 మ్యాచ్ ల్లో విజయం సాధించి 14 పాయింట్లతో ముందజలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు రెండో స్థానంలో ఉంది. ముంబై, గుజరాత్ టైటాన్స్ ఇద్దరిలో ఎవ్వరూ విజయం సాధించిన ఆర్సీబీ ఉన్నటువంటి నెంబర్ వన్ స్థానం కోల్పోవడం ఖాయమని పలువురు ముంబై, గుజరాత్ అభిమానులు పేర్కొంటున్నారు. ఈ సీజన్ లో ఆర్సీబీ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ చాలా బాగుందనే చెప్పాలి. గత సీజన్ వరకు కేవలం బ్యాటింగ్ ని మాత్రమే నమ్ముకున్న ఆర్సీబీ జట్టు ఈ సారి ఇద్దరూ రాణిస్తుండటంతో విజయాల పరంపర కొనసాగిస్తోంది.


ఇక ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, సాల్ట్, రజత్ పాటి దార్, టిమ్ హెడ్ ఫామ్ లో ఉండటంతో అద్భుతమైన విజయాలను సాధిస్తుంది. మొన్నటి మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ విజయం సాధించింది. లేదంటే ఆర్సీబీ ఓడిపోయే అవకాశం ఉండే. ఆర్సీబీ బౌలర్లలో హెజల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థులను తక్కువ స్కోర్ కే కట్టడి చేస్తున్నారు. బ్యాటింగ్ లో రాణించడంతో ఈ సీజన్ లో మంచి విజయాలు సాధిస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఆర్సీబీ పై  ట్రోలింగ్స్ చేయడం చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. 

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×