BigTV English
Advertisement

Olympics 2024 India vs Germany: సెమీస్ లో పోరాడి ఓడిన హాకీ జట్టు : ఇక కాంస్యమే మిగిలింది

Olympics 2024 India vs Germany: సెమీస్ లో పోరాడి ఓడిన హాకీ జట్టు : ఇక కాంస్యమే మిగిలింది

India vs Germany hockey semi final highlights(Sports news today):

పారిస్ ఒలింపిక్స్ లో ఆశలు నీరుగారిపోతున్నాయి. ఇంతవరకు అద్భుతంగా ఆడిన హాకీ జట్టు సరిగ్గా ఆడాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. జర్మనీతో జరిగిన సెమీఫైనల్ లో భారత్ 2-3 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఫైనల్ కి చేరాలన్న కోరిక చెదిరిపోయింది. అయితే జర్మనీతో జరిగిన మ్యాచ్ లో చివరి వరకు పోరాడింది. వన్ సైడ్ గా ఓటమిని అయితే అంగీకరించలేదు. అదొక్కటి భారతీయులకు ఊరట.


అయితే ఒలింపిక్స్ లో మనవాళ్లు ఫైనల్ కి చేరి 44 ఏళ్లు అవుతోంది. ఇప్పుడా కల మళ్లీ కలగానే మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఆఖరి వరకు హర్మన్‌ప్రీత్ సేన పోరాడింది. కీలక సమయంలో చేసిన తప్పిదాలు భారత్ కొంపముంచాయి. ఇక కాంస్యం కోసం రేపు గురువారం స్పెయిన్ తో తలపడాల్సి ఉంది.

భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ నిమిషం), సుఖ్‌జీత్ సింగ్ (36వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు.. జర్మనీ తరఫున గొంజాలో పెయిలట్ (18వ నిమిషం), క్రిస్టోఫర్ రుహుర్ ( 27వ నిమిషం), మార్కో మిల్ట్‌కావు ( 54వ నిమిషం)లో గోల్స్ సాధించారు. మరో గోల్ కోసం మనవాళ్లు చివరి వరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.


Also Read : ఫైనల్‌లో వినేశ్ ఫొగాట్.. ఆమె ఉడుంపట్టుకు క్యూబా రెజ్లర్ విలవిల..

సూపర్ ఫామ్ తో సెమీస్ చేరిన హర్మన్ ప్రీత్ సేనకు జర్మనీని నిలువరించడం అసాధ్యమైంది. గత ఒలింపిక్స్ పోరులో మన ఇండియా జర్మనీని ఓడించి, కాంస్య పతకం గెలిచింది. ఇప్పుడా జట్టు అందుకు ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది.

స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ గైర్హాజరీ టీమిండియా కొంపముంచింది. క్వార్టర్ ఫైనల్లో రెడ్ కార్డ్‌ ఎదుర్కొన్న అతనిపై ఓ మ్యాచ్‌ నిషేధం పడింది. ఈ నిర్ణయం భారత్ విజయవకాశాలను దెబ్బతీసిందని చెప్పాలి.

అత్యుత్సాహమే భారత్ కొంప ముంచిందని అంటున్నారు. ఎందుకు ప్రత్యర్థి జట్లతో గొడవలు పడాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అద్భుతంగా ఆడిన మన జట్టు.. అర్థం లేని ఈగోల వల్ల.. నేడు ఫైనల్ లో స్వర్ణం లేదా రజత పతకం అందుకునే అవకాశాన్ని కోల్పోయిందని అంటున్నారు.

 

Related News

RCB ON SALE: అమ్ముడుపోయిన RCB, WPL జ‌ట్లు.. మార్చి నుంచే కొత్త ఓన‌ర్ చేతిలో !

Indian Womens Team: ప్ర‌ధాని మోడీకి వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల స్పెష‌ల్ గిఫ్ట్‌..”న‌మో” అంటూ

IND VS SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌..ష‌మీకి నిరాశే, పంత్ రీ ఎంట్రీ, టీమిండియా జ‌ట్టు ఇదే

Bowling Action: ముత్త‌య్య, భ‌జ్జీ, వార్న్‌, కుంబ్లే అంద‌రినీ క‌లిపేసి బౌలింగ్‌.. ఇంత‌కీ ఎవ‌డ్రా వీడు!

WI vs NZ 1st T20i: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

pak vs sa match: గ‌ల్లీ క్రికెట్ లాగా మారిన పాకిస్తాన్ మ్యాచ్‌… బంతి కోసం 30 నిమిషాలు వెతికార్రా !

Jemimah Rodrigues Trolls: ఆ దేవుడి బిడ్డే లేకుంటే, టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేదే కాదు.. హిందువుల‌కు కౌంట‌ర్లు ?

Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే

Big Stories

×