BigTV English

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కమలాహారిస్ ప్రచారంలో ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్‌వాజ్‌

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కమలాహారిస్ ప్రచారంలో ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్‌వాజ్‌

Kamala Harris in US president elections(Latest world news): ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. ఆమె నామినేషన్‌ అధికారికంగా ఓకే అయ్యింది. ఆమెకు అనుకూలంగా ఆ పార్టీ తరపున 99 శాతం మంది మద్దతు ఇచ్చారు. ఆమెను బలపరుస్తూ దేశవ్యాప్తంగా దాదాపు 4,500 మంది ఓటేశారు. కమలాహారిస్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్‌వాజ్‌ను ఎంపిక చేశారు.


అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలాహారిస్ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్‌వాజ్‌‌తో కీలకమైన నగరాల్లో ప్రచారం చేపట్టారు. ప్రజల నుంచి మాంచి మద్దతు లభించింది. తాము అధికారంలోకి వస్తే చేయబోయే జాబితాను ప్రజల ముందు ఉంచారు. టిమ్‌వాజ్ ఎవరోకాదు.. ఆర్మీ నేషన ల్ గార్డులో రెండున్నర దశాబ్దాలుగా పనిచేశారు.

అంతేకాదు టీచర్, ఫుట్‌బాల్ కోచ్‌ అనుభవం ఆయన సొంతం. టిమ్ తన వ్యూహాలతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ లపై విమర్శలు గుప్పించడంతో అందర్నీ ఆకట్టుకున్నారు. 2018లో గవర్నర్‌గా పోటీ చేసిన గెలిచారు టిమ్‌వాజ్. ఆయనను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆ దేశ పశ్చిమ ప్రాంతంలో ఆ పార్టీకి కొత్త జోష్ వస్తుందని భావిస్తున్నారు.


ALSO READ: బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం

టిమ్‌వాజ్‌తో కలిసి కమలాహారిస్ మరిన్ని సభలు పెడితే పార్టీ గెలుపు సునాయాశమేనన్నది డెమోక్రటిక్ ప్రతినిధులు అంచనా. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో కమలాహారిస్ విజయం సాధిస్తారని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షుడైతే మంచిగా ఆలోచన చేస్తారని 51 శాతం మంది అంగీకరించగా, అదే కమలాహారిస్ అయితే మెరుగ్గా పాలిస్తారని 64శాతం వెల్లడించారు.

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×