BigTV English

Padma Shri awardee Sundar Arrest: పరిచయం, అవార్డు ఆయన పెట్టుబడి.. బుక్కైన పద్మశ్రీ అవార్డు గ్రహీత సుందర్

Padma Shri awardee  Sundar Arrest: పరిచయం, అవార్డు ఆయన పెట్టుబడి.. బుక్కైన పద్మశ్రీ అవార్డు గ్రహీత సుందర్

Padma Shri awardee Sundar Arrest(News update today in telugu): మేడి పండు చూడు మేలిమై ఉండు – పొట్ట విప్పి చూడు పురుగు లుండు.. ఈ సామెత కేరళకు చెందిన ఓ బిజినెస్‌మేన్‌కు అతికినట్టు సరిపోతుంది. పైకి వ్యాపారవేత్తగా కనిపించాడు.. అందర్నీ నమ్మి పెట్టుబడులు పెట్టించాడు. సమయం అయినా డబ్బులు ఇవ్వకపోవడంతో అసలు గుట్టు బయటపడింది. పోలీసులు అరెస్ట్ చేయడం, న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడం చకచకా జరిగింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా.


సుందర్ మీనన్.. ఈ పేరు ఇప్పుడు కేరళలో మార్మోగుతోంది. పరిచయాలు, ఆలోచనలు, ప్రజల వీక్‌నెస్ ఆయన పెట్టుబడి. సక్సెస్ అయ్యాడు.. కేంద్ర‌ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఫైనాన్స్ సమస్యల నుంచి బయటపడాలని భావించాడు. ప్రజలు ఊరుకుంటారా? ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. ఇంకే ముందు.. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయడం, ఆపై న్యాయ స్థానం జైలుకి పంపడం చకచకా జరిగిపోయింది.

కేరళలోని త్రిసూర్‌కి చెందిన వ్యాపారవేత్త సుందర్ మీనన్.. ఓ కంపెనీకి ఛైర్మన్ అంతేకాదు పలు సంస్థ లకు డైరెక్టర్లగా వ్యవహరిస్తు న్నాడు. సుందర్ వ్యాపారం గురించి కాసేపు పక్కనబెడితే.. మదుపరుల నుంచి దాదాపు 8 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించాడు. ఆ డబ్బుతో తనకు ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. తనకున్న పలుకుబడితో 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నాడు. ఇంత వరకు సుందర్ ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యింది.


ALSO READ: మా స్థానంలో కూర్చోండి.. మాపై ఎంత ఒత్తిడి ఉందో తెలుస్తుంది: సుప్రీం సీజేఐ

ఇన్వెస్టర్ల నుంచి దాదాపు 8 కోట్ల డిపాజిట్లు సేకరించాడు సుందర్ మీనన్. అయితే మెచ్యూరిటీ తర్వాత డబ్బును ఎగవేసే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారంలో ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ పోలీసులు దూకుడు ప్రదర్శించలేకపోయారు. ఈ వ్యవహారం తారాస్థాయికి చేరడంతో చివరకు వివిధ సెక్షన్ల కింద 18 కేసులు నమోదు చేశారు. ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరు పరడం, రిమాండ్ విధించడం జరిగిపోయింది.

63 ఏళ్ల సుందర్ మీనన్.. డిపాజిట్ల సేకరణలో దాదాపు 62 మంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్టు తేలింది. ఆర్‌బీఐ రూల్స్‌ని ఉల్లంఘించాడు కూడా. సుందర్ కంపెనీకి చెందిన ఆస్తులు, లావాదేవీలను స్తంభింపజేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి త్రిసూర్‌కు చెందిన మీనన్, ఎన్నారై బిజినెస్‌మేన్. అనేక కేసులను ఎదుర్కొంటున్నాడు. 2015లో ఆయనకు యునైటెడ్ స్టేట్స్‌లోని యూరోపియన్ కాంటినెంటల్ కమ్యూనిటీ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆసియా పసిఫిక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు కూడా. చాలావరకు ఛారిటబుల్ ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు చేశారాయన.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×