BigTV English

Mithali Raj – Shikhar Dhawan Marriage : ఇది నిజమేనా? మిథాలి రాజ్ తో.. శిఖర్ ధావన్ పెళ్లి?

Mithali Raj – Shikhar Dhawan Marriage : ఇది నిజమేనా? మిథాలి రాజ్ తో.. శిఖర్ ధావన్ పెళ్లి?

Mithali Raj – Shikhar Dhawan Marriage : భారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా మారింది. ఎందుకంటే ఈ ఆట వద్దకు వచ్చేసరికి మాత్రం అన్ని మతాలవారు ఒక్కటై పోతారు. అందరూ ఇండియా గెలవాలని కోరుకుంటారు. అలాంటి క్రికెట్ లో ఏదైనా హాట్ న్యూస్ వచ్చిందంటే.. అది అగ్గిలా రాజుకుంటుంది. అలాంటిదే ఇప్పుడు ఒక న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది.


అదేమిటంటే టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఒక స్పోర్ట్స్ షో ‘ధావన్ కరేంగే’లో పాల్గొంటున్నాడు. జియో సినిమాలో ఈ ప్రోగ్రాం వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఒక వార్త టాప్ హెడ్ లైన్స్ లోకి వెళ్లిపోయింది. అదేమిటంటే శిఖర్ ధావన్ తో మిథాలి రాజ్ పెళ్లి వార్త.. ఇది చూడగానే అందరిలో ఒక ఆసక్తి బయలుదేరింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ ‘ధావన్ కరేంగే’షోలో పాల్గొనేందుకు ధావన్ తో పాటు టీమ్ ఇండియా ఉమెన్ క్రికెటర్, ఆర్సీబీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా పాల్గొంది. ఈ షో జరుగుతుండగా ధావన్ మాట్లాడుతూ.. ముందు నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలని అన్నాడు.


Also Read : భారత ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ ఎవ్వరినీ సంప్రదించలేదు: జై షా!

ఏమిటి? అని మిథాలి అడిగితే.. సోషల్ మీడియాలో మిథాలి రాజ్ ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనే వార్త వస్తోంది. దానికి నాకు ఆన్సర్ కావాలి అని అన్నాడు. అంతే ఆ మాటతో ఒక్కసారి మిథాలి రాజ్, ధావన్ పెద్దపెట్టున నవ్వేశారు.

నిజానికి శిఖర్ ధావన్ షోకు మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ అతిథిగా వచ్చారు. ఈ సమయంలో, మిథాలీతో క్రికెట్‌తో పాటు ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా తమ పెళ్లి వార్తని పుకారుగా పేర్కొన్నాడు. ఇదో విచిత్రమైన రూమర్ అని శిఖర్ ధావన్ అన్నాడు.

అంతేకాదు ఈ షో సందర్భంగా ధావన్ మాట్లాడుతూ రిషబ్ పంత్ ని కొనియాడాడు. కారు ప్రమాదం తర్వాత తను తిరిగి క్రికెట్ ఆడటం, అంతే కాదు జాతీయ జట్టులోకి ఎంపిక కావడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నాడు. ఇది నేటి యువతరం చూసి నేర్చుకోవాలని అన్నాడు. మనిషి అనుకుంటే సాధించలేదనిదంటూ ఏదీ లేదని అన్నాడు. తను నా స్నేహితుడైనందుకు గర్వపడుతున్నానని తెలిపాడు.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×