BigTV English

Mohammed Shami : వరల్డ్ కప్ లో షమీ న్యూ రికార్డ్స్.. ఇన్నాళ్లూ ఎందుకు పక్కన పెట్టారు?

Mohammed Shami : వరల్డ్ కప్ లో షమీ న్యూ రికార్డ్స్.. ఇన్నాళ్లూ ఎందుకు పక్కన పెట్టారు?
Mohammed Shami

Mohammed Shami : మన ఇండియా క్రికెట్ సభ్యుల సెలక్షన్ ఎంత గొప్పగా ఉంటుందో ఒకొక్కకసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నెటిజన్లు అయితే మామూలుగా ఆడుకోవడం లేదు.
అన్నగారు నటించిన దాన వీర శూర కర్ణ సినిమా తరహాలో డైలాగుల మీద డైలాగులు వేస్తూ బీసీసీఐపై దాడి చేస్తున్నారు.


అయినను పో..
షమీని ఎందుకు పక్కన పెట్టవలే?

పెట్టెను పో.. మరి వరల్డ్ కప్ కి ఎందుకు ఎంపిక చేయవలె?  

చేసెను పో..మరి ఫైనల్ జట్టులో ఎందుకు లేకపోవలె?


ఇలా రాస్తూ వారికి విసుగొచ్చిందేమో..తర్వాత నుంచి డైరక్ట్ అయిపోయారు.

పోతే పోయారు..నాలుగు మ్యాచుల్లో కూడా శార్దూల్ ఠాగూర్ పై ఉన్న ఆసక్తి..షమీపై ఎందుకు చూపించలేదు..
చూపించలేదు పో..హార్దిక్ పాండ్యాకి గాయం కాకపోతే..
షమీని బెంచ్ కే పరిమితం చేసేవారా?
అటులైన..నాలుగు మ్యాచ్ ల తర్వాత గతిలేక ఎంపిక చేసితిరా?
అని ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
మహ్మద్ షమీ లాంటి ఒక ఫాస్ట్ బౌలర్ ని ఇంతవరకు పక్కన పెట్టడం షేమ్ షేమ్ అని నెట్టింట ట్రోలింగులు వస్తున్నవి…
వాటికేమని బదులిచ్చెదరు..
అని ప్రశ్న-జవాబులు వారే రాసేస్తున్నారు.
ఇక చివరికి..
అటులైనను పో..ఇటులైనను పో..మరి రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ వారెందుకు? అటో ఇటో ఎటో పోకుండా.. అని కూడా వారికి తగిలిస్తున్నారు.
ప్రస్తుతం నెట్టింట..షమీనా..ఇన్నాళ్లూ పక్కన పెట్టారు..
వరల్డ్ కప్ ట్రాక్ రికార్డ్ తెలిసే ఇలా చేశారా? అని దంచేస్తున్నారు. ప్రస్తుతం ఇవే ప్రశ్నలు తెగ వైరల్ అవుతున్నాయి.
టీమ్ మేనేజ్మెంట్ కూర్పులో  కెప్టెన్, కోచ్ లది ప్రధాన పాత్ర కదా..11మంది ఫైనల్ జట్టులోకి షమీని ఎందుకు తీసుకోలేదో వీరు కూడా సమాధానం చెప్పాలని అంటున్నారు.

ఇకపోతే షమీ ఎంత విలువైన బౌలర్ అన్నది..తను వేసిన మొదటి బంతికే వికెట్ తీసి చాటి చెప్పాడు. బ్రహ్మండమైన స్కోర్ చేసేలా కనిపించిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ విల్ యంగ్ వికెట్ తీశాడు. ఒక దశలో 300పైనే స్కోర్ దాటుతుందని అంతా అనుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి షమీ కాపాడాడు. ఆ టైమ్ లో టపటపా వికెట్లు తీశాడు. మొత్తమ్మీద 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడమే కాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఇకపోతే వరల్డ్ కప్ ల్లో ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన షమీ 36 వికెట్లు తీశాడు. 31 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లేని అధిగమించాడు. అయితే షమీ ముందు జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ ఉన్నారు. ఇద్దరు కూడా 44 వికెట్లు తీశారు. ఇప్పటి నుంచైనా అన్ని మ్యాచ్ ల్లో షమీని ఆడిస్తే మిగిలిన 9 వికెట్లు తీసి వీరిని అధిగమిస్తాడనడంలో సందేహమే లేదు.

Related News

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌..పీక‌ల్లోతు క‌ష్టాల్లో టీమిండియా

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Big Stories

×