Mohammed Siraj: భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ కొద్ది రోజుల క్రితం ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో డేటింగ్ లో ఉన్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని బాంద్రాలో జరిగిన జనై భోస్లే 23వ జన్మదిన వేడుకలలో మొహమ్మద్ సిరాజ్ {Mohammed Siraj} పాల్గొనడం, ఆ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమే తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.
ఆ ఫోటోలలో మొహమ్మద్ సిరాజ్, జనై చాలా సన్నిహితంగా కనిపించడంతో వీరు డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ చెక్కర్లు కొట్టాయి. వీరు చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారని పలు హిందీ, తెలుగు వెబ్సైట్ లు కూడా పేర్కొన్నాయి. అందరూ ఇలా తప్పుగా భావించి ప్రచారం చేయడంతో.. వెంటనే ఆ రూమర్స్ కి అడ్డుకట్ట వేయాలని భావించిన సిరాజ్ {Mohammed Siraj} స్పందించాడు. తమపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. సిరాజ్ తన ఇంస్టాగ్రామ్ లో ఇలా పేర్కొన్నాడు. ” జనై నాకు చెల్లెలు లాంటిది. జెనై లాంటి చెల్లెలు నాకు ఎవరూ లేరు.
ఆమె లేకుండా నా జీవితం ఉండదు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాల మధ్య చంద్రుడు ఒక్కడే ఉన్నట్లుగా.. జనై వెయ్యి మందిలో ఒకరు” అని సిరాజ్ {Mohammed Siraj} తన అభిప్రాయాన్ని తెలిపాడు. దీంతో జనై కూడా ఈ రూమర్స్ పై రియాక్ట్ అయ్యింది. మహమ్మద్ సిరాజ్ తనకు చాలా ఇష్టమైన సోదరుడని పేర్కొంది. దీంతో ఈ పుకార్లకు పుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా జనై భోస్లేతో కలిసి పాట పాడిన సిరాజ్.. ఆ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. వీరిద్దరూ కలిసి డ్యూయెట్ సాంగ్ పాడుతున్న వీడియో {video goes viral in social media} సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమె తాజా మ్యూజిక్ ఆల్బమ్ లోని “కెహెందీ హై” పాటను వీరిద్దరూ కలిసి పాడారు. ఈ వీడియోని మహమ్మద్ సిరాజ్ {Mohammed Siraj} తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ” మనమంతా మన కళలని అనుసరించడానికి కారణమైన వ్యక్తి కోసం ఈ పాట. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్” అని జనై ప్రశంసలు కురిపించాడు. ఇక జెనై – సిరాజ్ పాడిన పాట ప్రస్తుతం {video goes viral in social media} సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఫిబ్రవరి 10న సిరాజ్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
శనివారం రోజు యూసఫ్ గూడా లోని ఫస్ట్ బెటాలియన్ లో మహమ్మద్ సిరాజ్ {Mohammed Siraj} అసిస్టెంట్ కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో తెలంగాణ ప్రభుత్వం మహమ్మద్ సిరాజ్ తో పాటు యువ బాక్సర్ నిఖత్ జరీన్ కి డిఎస్పీ ఉద్యోగాలు కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రోజున మహమ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరించాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">