Food For Weight Loss: ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు , జీవనశైలి కారణంగా బరువు పెరిగే సమస్య కనిపిస్తోంది. దీంతో బరువు తగ్గడానికి చాలా మంది జిమ్‌కు వెళ్లి ఖరీదైన సప్లిమెంట్లను ఉపయోగిస్తారు. కానీ తక్కువ బడ్జెట్‌లో కూడా మీరు బరువు తగ్గవచ్చు. ఇందుకోసం మీరు ఇంట్లోనే సింపుల్‌గా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే సరిపోతుంది. దీంతో బరువు తగ్గడం సాధ్యమవుతుంది . తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గించే ఆహారం:
1. గంజి:
గంజి మంచి పోషకమైన ఆహారం. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అంతే కాకుండా మీ ఆహారపు అలవాట్లను నియంత్రిస్తుంది. మీరు ఉదయం పూట టిఫిన్‌కు బదులగా గంజి తీసుకోవచ్చు. దీన్ని నీటిలో లేదా పాలలో ఉడికించి తినండి. అంతే కాకుండా దీనికి కొన్ని పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ కలిపి తినడం ద్వారా రుచిని కూడా పెంచుకోవచ్చు.
ప్రయోజనాలు:
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది.
శక్తిని అందిస్తుంది.
2. పండ్లు , పచ్చి కూరగాయలు తీసుకోవడం:
బరువు తగ్గడానికి పండ్లు, కూరగాయలు ఒక అద్భుతమైన, చవకైన ఆహారం. అవి ఫైబర్, నీరు , అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. అంతే కాకుండా మీరు రోజుకు 2-3 సార్లు పండ్లు, పచ్చి కూరగాయలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దోసకాయ, టమోటా, , ఆపిల్, అరటి, నారింజ మొదలైనవి బరువు ఈజీగా తగ్గడంలో ఉపయోగపడతాయి.
ప్రయోజనాలు:
ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
3. పెరుగు:
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయ పడుతుంది. మీరు దీన్ని టిఫిన్ లేదా భోజనంతో పాటు తినవచ్చు. మీరు పెరుగును పండ్లతో కొన్ని గింజలతో లేదా తేనెతో కలిపి కూడా తినవచ్చు.
ప్రయోజనాలు:
జీవక్రియను వేగవంతం చేస్తుంది.
కడుపులో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది.
కేలరీలను తగ్గిస్తుంది.
4. కివి, ఆపిల్ డైట్:
కివి, ఆపిల్ రెండూ బరువు తగ్గడానికి అద్భుతమైన పండ్లు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు వీటిని ఉదయం పూట లేదా స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు.
ప్రయోజనాలు:
వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగుపడుతుంది
శరీరానికి విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.
Also Read: ఈ స్క్రబ్ ఒక్కసారి వాడితే చాలు.. అమ్మాయిలు అసూయపడే అందం
5. సూప్ డైట్:
బరువు తగ్గడానికి సూప్‌లు ఒక గొప్ప, చౌకైన ఎంపిక. మీరు కూరగాయల సూప్, ఓట్ మీల్ సూప్ లేదా తయారు చేసుకోసుకుని తాగవచ్చు. సూప్‌లో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా వీటితో కడుపు త్వరగా నిండిపోతుంది. దీని వలన తక్కువ తినడం అలవాటు అవుతుంది.
ప్రయోజనాలు :
త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది.
తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.