Chandu Mondeti : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ( Nikhil ) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ 2.. అని డే మూవీ లో రిలీజ్ అయిన ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని ఎందుకు ఇవ్వడంతో పాటు కలెక్షన్స్ ని కూడా భారీగానే రాబట్టింది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. నిఖిల్ కెరియర్ లో ది బిగ్గెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ మూవీకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందు మొండేటి ( chandu Mondeti) దర్శకత్వం వహించారు. రీసెంట్ గా తండేల్
చిత్రానికి కూడా ఈయన దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. సినిమా వచ్చి రెండు వారాలు అవుతున్న కూడా ఇప్పటికీ కలెక్షన్స్ తగ్గడం లేదు. ఇప్పటికే 130 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిన ఈ మూవీ 200 కోట్లు రాబట్టే దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఈ సినిమా భారీ సక్సెస్ అందుకున్న తర్వాత డైరెక్టర్ ఎవరితో నెక్స్ట్ సినిమా చేస్తారన్న ప్రశ్నలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు తమిళ స్టార్ హీరో సూర్య ( surya ) తో సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో హీరోతో సినిమాను అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్.. మరి ఆ హీరో ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కార్తికేయ 2 సినిమాకు కొనసాగింపుగా మరో సీక్వెల్ సినిమా కార్తికేయ 3 ని తీసుకురానున్నట్లు గతంలో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కార్తికేయ3 తన చేతిలో ఉన్నప్పటికీ ఆ సినిమా మొదలుపెట్టే లోపు ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనుకున్నాడు చందూ. ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్ లో ఓ సినిమాకు కమిట్ అయిన చందూ, అందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఓ కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడు. చందూ చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. అయితే ఈ సినిమాను ఎప్పుడూ సెర్చ్ మీదకు తీసుకెళ్దాం అన్న విషయంపై సూర్య ఇంకా క్లారిటీ ఇవ్వలేదని ఫిలింనగర్లో టాక్. దాంతో డైరెక్టర్ తన రూటుని మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సూర్యకు సినిమా కథ చెప్పి చాలా రోజులవుతున్నా కూడా ఇప్పటికీ సూర్య దాన్ని సెట్స్ మీద తీసుకెళ్దామని ఆలోచనలు లేనట్టు చందు మొండిటి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన ఏమీ మాట్లాడకుండా ఉండడంతోనే నాగచైతన్యతో తండేల్ మూవీ ని తెరకెక్కించారు డైరెక్టర్. ఆ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.. ఎలాగూ సూర్య తో సినిమాకు లేటవుతుంది కదా అనుకున్న చందూ, నాగ చైతన్య తో తండేల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి, మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు.. అయితే ఇప్పటికి కూడా సూర్య మౌనంగానే ఉండటంతో ఇప్పుడు కార్తికేయ 3 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని డైరెక్టర్ చందు మొండేటి ఆలోచిస్తున్నారట. లేదంటే వేరే ఏదైనా సినిమా కానీ చేసే ఛాన్సుంది. ఏదేమైనా చందూ నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడన్నది తెలియాలంటే మరో నెల రోజుల వరకు ఆగాల్సిందే.. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తండేల్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.. కార్తికేయ 3 సినిమాను కనుక ముందుగా చేస్తే వచ్చేయడాది జనవరిలోని ఆ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు డైరెక్టర్.. ఏ హీరోతో సినిమా చేస్తాడు త్వరలోనే తెలియనుంది..