E-Paper
Advertisement

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?
Advertisement

Maruti Swift Price Hike: మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలని చూస్తున్న వారికి కంపెనీ మరోసారి షాక్ ఇచ్చింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన స్విఫ్ట్ ధరను మళ్లీ పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని వేరియంట్లపై రూ.5,000 ధర పెంపును ప్రకటించింది. దీంతో స్విఫ్ట్‌ ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇకపై కొంచెం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ధరల సవరణ తర్వాత స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.5.84 లక్షలకు చేరింది. టాప్ వేరియంట్ ధర రూ.8.89 లక్షల వరకు ఉంది. ఆన్‌ రోడ్ ధరలో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలిసిన తర్వాత మొత్తం ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది.

అన్ని వేరియంట్లకు ఒకే పెంపు!

స్విఫ్ట్‌ లో వేర్వేరు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కార్ల ధరలను పెంచేటప్పుడు కొన్ని వేరియంట్లపై మాత్రమే సవరణలు చేస్తుంటారు. అయితే, ఈసారి మారుతి సుజుకి స్విఫ్ట్ విషయంలో అలాంటి విధానం పాటించలేదు. కారు లైనప్‌లోని అన్ని వేరియంట్ల ధరలను రూ.5,000 చొప్పున పెంచింది. దీంతో ఎంట్రీ లెవల్ మోడల్ నుంచి టాప్ వేరియంట్ వరకు కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

ఇప్పటికే పలు మారుతి కార్ల ధరలు పెంపు!

Advertisement

ఇటీవల మారుతి సుజుకి కార్ల ధరల్లో వరుసగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కంపెనీకి చెందిన జిమ్నీ, ఇ విటారా, ఎస్ ప్రెస్సో, బాలెనో ప్రీ ఫేస్‌లిఫ్ట్, ఇన్విక్టో, బ్రెజ్జా లాంటి మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఈ జాబితాలో స్విఫ్ట్ కూడా చేరింది. మారుతి సుజుకి పోర్ట్‌ ఫోలియోలో స్విఫ్ట్‌ కు  ప్రత్యేకమైన స్థానం ఉంది. మంచి మైలేజ్, సిటీ డ్రైవింగ్‌ కు అనుకూలమైన పరిమాణం, అందుబాటు ధర కారణంగా ఈ హ్యాచ్‌ బ్యాక్‌కు ఎప్పటి నుంచో డిమాండ్ కొనసాగుతోంది.

ఫ్రాంక్స్ ఫేస్‌ లిఫ్ట్‌ పైనా క్రేజ్!  

మారుతి సుజుకి కొత్త మోడల్స్, అప్‌ డేటెడ్ కార్లపైనా దృష్టి పెడుతోంది. బాలెనో ఫేస్‌ లిఫ్ట్‌ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత, ఫ్రాంక్స్ ఫేస్‌ లిఫ్ట్‌ ను కూడా త్వరలో పరిచయం చేసే అవకాశం ఉంది. ఫ్రాంక్స్‌ తో పాటు మారుతి సుజుకి భాగస్వామ్య బ్రాండ్లకు చెందిన టయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైసర్ మోడళ్లలోనూ కొత్త వెర్షన్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో రాబోయే నెలల్లో ఈ సెగ్మెంట్‌ లో పోటీ మరింత పెరగొచ్చు.

ఈ నెలలో మరోసారి ధరల పెంపు?

Advertisement

అటు మారుతి సుజుకి కార్ల ధరలకు సంబంధించి మరో కీలక విషయం కూడా ఉంది. ఈ నెల చివర్లో కంపెనీ మరోసారి ధరలను సవరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే కేవలం మూడు నెలల వ్యవధిలో మారుతి సుజుకి కార్ల ధరలను పెంచడం ఇది మూడోసారి అవుతుంది. వరుస ధరల పెంపుతో కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి బడ్జెట్‌పై అదనపు భారం పడే అవకాశం ఉంది.

Read Also: ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

Tags

Related News

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

టాటా పంచ్ ధరల షాక్.. పెట్రోల్, EV మోడళ్లపై ఏకంగా రూ.20 వేల పెంపు!

ఫాస్టాగ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బ్యాంక్ మారితే కొత్త ట్యాగ్ అవసరం లేదు!

1980’sలోబాలీవుడ్‌ను ఏలిన 5 కార్లు ఇవే.. హీరోల కంటే ఈ కార్లకే ఎక్కువ క్రేజ్!

Big Stories

Advertisement
×