BigTV English

MS Dhoni: హైదరాబాద్ ఆటగాళ్లకు ధోనీ క్లాస్.. అలా కాదు ఇలా ఆడాలి..

MS Dhoni: హైదరాబాద్ ఆటగాళ్లకు ధోనీ క్లాస్.. అలా కాదు ఇలా ఆడాలి..

MS Dhoni: ఎంఎస్‌ ధోనీ.మిస్టర్‌ కూల్‌ స్కిప్పర్‌. మ్యాచ్‌ను గెలిపించడంలో ధోనీ ప్లాన్స్‌ అలగ్‌ ఉంటాయ్‌. వికెట్ల వెనకల ఉంటూనే.. మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల కెప్టెన్సీ ధోనీ సొంతం. అలాంటి ధోనీ తరచుగా యువకులకు టెక్నిక్స్‌ నేర్పిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్‌- చెన్నై జట్ల మ్యాచ్‌ ముగిసిన తర్వాత ధోనీ యువకులకు క్లాసులు తీసుకున్నాడు. SRHలోని యువ బ్యాటర్లకు కొన్ని మెళుకువలను నేర్పించాడు. అటాకింగ్‌.. డిఫెన్స్‌ ఎలా ఆడాలో వివరించాడు. షాట్ సెలక్షన్‌ పైనా కూడా మిస్టర్‌ కూల్‌.. యంగ్‌స్టర్స్‌కు తర్పీదు ఇచ్చాడు.


అబ్దుల్‌ సమద్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, రాహుల్‌ త్రిపాఠి, ఉమ్రాన్‌ మాలిక లాంటి ఆటగాళ్లు కూడా ధోనీ స్పీచ్‌ ను అలాగే వింటూ ఉండిపోయారు. ధోనీ టెక్నిక్స్‌ చెబుతుండగా.. SRH యంగ్‌ ప్లేయర్స్‌ అంతా కూడా చాలా కాన్‌సెన్ట్రేషన్‌ తో వింటున్నారు. ఇప్పుడీ ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ గా మారాయి. ఈ ఫోటోలపై SRH ఫ్యాన్స్‌ సెటైరికల్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనలో పెద్దగా మార్పు ఉండదని విమర్శిస్తున్నారు. కనీసం సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ తో జరిగే మ్యాచ్‌లోనైనా మంచి స్కోరింగ్‌ చేయాలంటున్నారు.

ఈ మ్యాచ్ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఓటమిపాలైంది. తొలుత టాస్‌ గెలిచిన చెన్నై.. బౌలింగ్‌ తీసుకుంది. దీంతో బ్యాటింగ్‌ కు దిగిన మార్కరం సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్య చేధనలో భాగంగా చెన్నై జట్టు.. మూడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ 35, కాన్వే 77 పరుగులతో అదరగొట్టారు. హైదరాబాద్‌ జట్టు ఆడిన6 మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.


Related News

AFG vs HK Asia Cup 2025: ఆసియా క‌ప్ లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ..చిత్తు చిత్తైన హంగాంగ్‌

SA20 Auction: తెంబా బ‌వుమా, అండ‌ర్స‌న్ కు ఘోర అవ‌మానం.. ఇద్ద‌రూ అన్ సోల్డ్‌

SA 20 2026 auction : బ్రెవిస్ కు ఏకంగా రూ.8కోట్లు.. మార్క్ర‌మ్ కు కావ్య పాప ద్రోహం.. ఆక్ష‌న్ లిస్ట్ ఇదే..!

Suryakumar Yadav : పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపిన సూర్య కుమార్… నమ్మకద్రోహం అంటూ ట్రోలింగ్!

Lalit Modi : ఇండియాను నిండా ముంచిన లలిత్ మోడీ అదిరిపోయే ప్లాన్.. ఫుట్ బాల్ వద్దు.. కబడ్డీ ముద్దు అంటూ

Mornie Morkel : పాకిస్తాన్ వీక్నెస్ మాకు తెలుసు.. వాళ్లను చావు దెబ్బ కొడతాం… టీమిండియా కోచ్ వార్నింగ్

×