Meena is the daughter who made Rajinikanth cry

Rajinikanth:- ర‌జినీకాంత్‌ను ఏడిపించిన మీనా కుమార్తె

Meena is the daughter who made Rajinikanth cry
Share this post with your friends

Rajinikanth:- ఎంత మంది అభిమానులున్నా, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మేం కూడా మ‌నుషుల‌మే అని అంటుంటారు అగ్ర క‌థానాయిక‌లు. బ‌య‌ట ఈవెంట్స్‌లో వాళ్లు చాలా ప్రొఫెష‌న‌ల్‌గా బిహేవ్ చేస్తుంటారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో వాళ్లు త‌న భావోద్వేగాల‌ను అదుపులో పెట్టుకోలేరు. చాలా మంది బ‌డా స్టార్స్ ఎమోష‌న‌ల్ అయిన వీడియోలు, ఫొటోల‌ను మ‌నం సోష‌ల్ మీడియాలో చూసే ఉంటాం. ఇప్పుడు ఈ లిస్టులోకి సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కూడా వ‌చ్చి చేరారు. మీనా సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 40 వ‌సంతాలు పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్ష‌న్‌లో ర‌జినీకాంత్ స‌హా ప‌లువురు తార‌లు పాల్గొన్నారు.

అప్పుడు మీనా గురించి ఆమె కుమార్తె నైనిక మాట్లాడిన వీడియోను విడుద‌ల చేశారు. అందులో నైనిక మాట్లాడుతూ ‘‘అమ్మా! నువ్వెంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నావు. బ‌య‌ట నువ్వు న‌టివే అయిన‌ప్ప‌టికీ ఇంటికి వ‌చ్చాక మాత్రం అమ్మ‌లా మారిపోతావు. న‌టిగా ఎంతో క‌ష్ట‌ప‌డి ఈస్థాయికి చేరుకున్నావు. ఓసారి మ‌నం అంతా మాల్‌కి వెళ్లిన‌ప్పుడు మీకు చెప్ప‌కుండా నేను మ‌రో షాప్‌కి వెళ్లి చాక్లెట్స్ తింటూ కూర్చున్నాను. చాలా సేప‌టి త‌ర్వాత నువ్వు అక్క‌డికి వ‌చ్చి నాపై కేక‌లు వేశావు. ఆరోజు నువ్వెందుకు కంగారు ప‌డ్డావో నాకు ఇప్పుడు అర్థ‌మ‌వుతుంది. ఆరోజు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. నాన్న చ‌నిపోయిన త‌ర్వాత ప‌రిస్థితులు చీక‌టిగా మారాయి. నువ్వెంతో మానసిక ఒత్తిడికి లోన‌య్యావో నాకు తెలుసు. ఇక‌పై నేను నిన్ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటాను. అన్ని విష‌యాల్లోనూ సాయం చేస్తాను’’ అన్నారు.

‘‘ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ చానెల్స్‌లో అమ్మ గురించి త‌ప్పుడు వార్త‌లు వ‌చ్చాయి. ఆమె న‌టి మాత్రమే కాదు, మీలా మ‌నిషే. ఆమెకు ఎమోష‌న్స్ ఉంటాయి. కాబ‌ట్టి ద‌య‌చేసి ఇలాంటి వార్త‌లు రాయ‌కండి’’ అన్నారు నైనిక. ఆమె మాట్లాడిన మాట‌ల‌ను విన్న ర‌జినీకాంత్ స‌హా అక్కడున్న ప‌లువురు తార‌లు ఎమోష‌న‌ల్ అయ్యారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Mahesh Babu 28 : మ‌హేష్ డ్యూయెల్ రోల్‌..!

Bigtv Digital

Allu Arjun: ఐకాన్ స్టార్‌తో అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ పాన్ ఇండియా మూవీ.. అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది

Bigtv Digital

Raashi Khanna: బాహుబ‌లి ఛాన్స్ వ‌దులుకున్న రాశీఖ‌న్నా.. అస‌లు విష‌యం చెప్పిన బ్యూటీ

Bigtv Digital

Jamuna : వెండితెర సత్యభామ జమున.. అలాంటి పాత్రల్లో ఆమెకు సాటిలేరెవ్వరూ..

Bigtv Digital

Bhagavanth Kesari: భగవంత్ కేసరి ప్రపంచం లో ఆ ఐదు పాత్రలు.. అనిల్ రావిపూడి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ..

Bigtv Digital

Mansion 24: మ్యాన్షన్‌ 24 వెబ్ సిరీస్.. ఎలా ఉందంటే..?

Bigtv Digital

Leave a Comment