MS Dhoni Drives Rishabh Pant Around In Ranchi : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని… జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని, రిటైర్మెంట్ లైఫ్ ను చిల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)… మహేంద్ర సింగ్ ధోని ఇంటికి వెళ్ళాడు. రాంచీలోని ధోని ఇంటికి వెళ్లిన రిషబ్ పంత్.. ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాంచీలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Ms Dhoni) సమక్షంలో ట్రైనింగ్ తీసుకుంటున్న రిషబ్ పంత్.. అదే సమయంలో అక్కడి అందాలు ఆస్వాదిస్తూ చిల్ కూడా అవుతున్నారు. అంతేకాదు తన వింటేజ్ కారులో రిషబ్ పంత్ ను మహేంద్రసింగ్ ధోని రాంచీ వీధుల్లో తింపారు. స్వయంగా ధోనీనే కారు డ్రైవ్ చేస్తూ… పక్కన రిషబ్ పంత్ ను కూర్చోబెట్టుకున్నారు. రాంచీలో ఉన్న గల్లీ గల్లీ తిరుగుతూ… చిల్ అయ్యారు. మహేంద్ర సింగ్ ధోని ఫాంహౌజ్ నుంచి బయలు దేరిన వీళ్ల కారు, దాదాపు 200 కిమీ తిరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం కావడంతో కారులో జర్నీ చేశారట. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
శ్రీలంకతో టీమిండియా త్వరలోనే రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు ఏడవ తేదీన ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటుంది. 15వ తేదీ నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా… రెండు టెస్ట్ 23వ తేదీన ఉంటుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ కోసం జూలై 28వ తేదీన జట్టును కూడా ప్రకటించారు. ఇందులో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు.
అయితే ఎలాగైనా ఈ టోర్నమెంటులో అద్భుతంగా రాణించాలని.. మహేంద్ర సింగ్ ధోని శిబిరంలో చేరాడు. అతను ఇస్తున్న విలువైన టెక్నిక్స్ ను నేర్చుకుంటున్నాడు రిషబ్ పంత్. అయితే, ఇవాళ ఆదివారం కావడంతో గురు-శిష్యులు కారులో షికార్డు కొట్టారు. రిషబ్ పంత్ తరహా లోనే మరో టీమ్ ఇండియా క్రికెటర్ రుతురాజ్ కూడా రాంచికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అతడు కూడా ధోని సారథ్యంలో ట్రైనింగ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఈ న్యూస్ బయటకు రావడంతో.. గౌతమ్ గంభీర్ ను తప్పించి, ధోనికి కోచ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే.. ధోనికి అవకాశం ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు.
💛 DHONI × PANT 🔥
The iconic duo enjoying some quality time together in Ranchi. 🏏✨ pic.twitter.com/XfiHrezt63
— Puneet Awasthi (@PuneetA77622712) August 2, 2026