E-Paper
Advertisement

టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ.. ఎంగేజ్‌మెంట్.. ఇప్పుడు ఎవరి దారి వారిదే!

టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ.. ఎంగేజ్‌మెంట్.. ఇప్పుడు ఎవరి దారి వారిదే!
Advertisement

Prithvi Shaw and Aakriti Agarwal:సినిమాలకి, క్రికెట్ కి అవినాభావ సంబంధం ఉన్న సంగతి అందరికి తెల్సిందే. వివియన్ రిచర్డ్స్ , నీనా గుప్తా ల నుండి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, కేఎల్ రాహుల్-అథియా శెట్టి ల వరకు ఎన్నో జంటలు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా కనిపిస్తాయి.

అయితే వీరిలో కొందరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లగా.. మరికొందరు మధ్యలోనే తెగదెంపులు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులో భారత క్రికెటర్ పృథ్వీ షా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్-నటి ఆకృతి అగర్వాల్ ల జోడీ కూడా కూడా చేరిపోయింది.

Advertisement

ఈ ఏడాది మార్చి 8న ఎంగేజ్‌మెంట్

విషయం లోకి వెళ్తే కొంతకాలంగా ప్రేమలో ఉన్న పృథ్వీ షా, ఆకృతి ఈ ఏడాది మార్చి 8న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెల్సిందే. ఇక పృథ్వీ స్వయంగా ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేయడంతో అప్పట్లో ఈ జంట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది కూడా.

Advertisement

అయితే జూలైలో ఆకృతి పెట్టిన కొన్ని పోస్టులు లని చూస్తే వీరిద్దరి మధ్య ఎదో గొడవ జరిగిందన్న అనుమానాలు మొదలయ్యాయి. తాను మోసపోయాననే అర్థం వచ్చేలా ఆమె చేసిన పోస్టు వైరల్ కావడంతో పృథ్వీ షాతో విభేదాలు వచ్చాయా? అంటూ నెటిజన్లు అప్పుడే డిబేట్లు పెట్టేశారు కూడా. అయితే ఆ పోస్టులో పృథ్వీ పేరును ఎక్కడా చెప్పకపోవడంతో మరి ఆ పోస్ట్ ఎవరి కోసం అయి ఉంటుందని డైలామాలో పడిపోయారంతా.

తమ గోల్స్ వేర్వేరు గా ఉండటంతో

అయితే తాజాగా ఆ అనుమానాలకి ఎండ్ కార్డ్ వేస్తూ తమ ఇద్దరి మధ్య రిలేషన్ ముగిసిన విషయాన్ని ఆకృతి స్వయంగా అనౌన్స్ చేసేసింది.ఫ్యూచర్ లో తమ తమ గోల్స్ వేర్వేరు గా ఉండటంతో, కలిసి నిర్ణయించుకునే విడిపోవాలకుంటున్నట్టు తెలిపింది. ఇద్దరి దారులు ఇక కలిసి ముందుకు వెళ్లవని అర్థమైందని తెలుపుతు తమపై ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ప్రైవసీని గౌరవించాలని కోరింది.

తెలుగు సినిమా ‘త్రిముఖ’లో నటిగా

పృథ్వీ షా విషయానికి వస్తే స్కూల్ క్రికెట్‌లో 546 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన అతను, చిన్న వయసులోనే టీమిండియాలో స్థానం సంపాదించాడు.అయితే ఫిట్ నెస్ కోల్పోవడంతో జట్టులో నుండి చోటు కోల్పోయాడు.ఇక ఆకృతి అగర్వాల్ విషయానికొస్తే సోషల్ మీడియాతో గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత నటనవైపు అడుగులు వేసింది ఈ భామ. లక్నోకు చెందిన ఆకృతి కంటెంట్ క్రియేటర్‌గా పాపులర్ అయి, తెలుగు సినిమా ‘త్రిముఖ’లో నటిగా కూడా కనిపించింది కూడా.

మొత్తంగా మార్చిలో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు దాదాపు ఆరు నెలల్లోనే బ్రేక్ పడటం ఇప్పుడు క్రికెట్, సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags

Related News

అందాల విందుతో ఐశ్వర్య మీనన్..కెమెరాలన్నీ ఆమెవైపే!

నాని చెప్పిన ‘సమ్మక్క’ వెనుక అసలు కథ ఏంటి?

సూర్య–జ్యోతిక మతం మార్చుకున్నారా? అసలు నిజం ఇదే!

ఒక్క పాటకు లక్ష జడలు సేల్.. ‘ఆయా షేర్’ రేంజ్ వేరే లెవెల్

కాకా ఎంట్రీకి డేట్ ఫిక్స్.. జనవరి 13న మెగాస్టార్ మాస్ జాతర!

గోవా టూర్‌లో స్నేహ ఉల్లాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

ఫౌజీ రిలీజ్‌పై సస్పెన్స్.. జనవరి 26కి వస్తుందా?

Big Stories

Advertisement
×