BigTV English

MS Dhoni Post Viral: కొత్త సీజన్.. కొత్త పాత్ర.. ధోనీ పోస్ట్ వైరల్..

MS Dhoni Post Viral: కొత్త సీజన్.. కొత్త పాత్ర.. ధోనీ పోస్ట్ వైరల్..

MS Dhoni Post Viral


MS Dhoni in ‘new role’:వయసు పెరిగినా, వన్నెతగ్గని క్రికెటర్ గా మహేంద్ర సింగ్ ధోనీ అందరికీ సుపరిచితమే. ఐపీఎల్ ప్రారంభం కానున్న సమయంలో తను పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట కలకలం సృష్టిస్తోంది. ‘కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వేచి చూడండి’ అంటూ రాసుకొచ్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫేస్‌బుక్‌లో చేసిన తాజా పోస్ట్ అభిమానులకు పరీక్షగా మారింది. IPL 2024కి కొన్ని వారాల ముందు ధోనీ ఫేస్ బుక్‌లో ఇక చిన్న పోస్ట్ చేశారు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ ప్రారంభోత్సవానికి కేవలం రెండు వారాల ముందు ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయడంతో తలా అభిమానులు ఏం జరగపోతుందా అని ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్నారు.

“కొత్త సీజన్, కొత్త ‘పాత్ర’ కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండి!” అతను రాశాడు. కొత్త సీజన్ అంటే IPL 2024 ఎడిషన్ ఆ కాదా అనేది అస్పష్టంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ, ధోనీ ‘కొత్త పాత్ర’ను ప్రకటించడంతో, పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయ్యింది.

ఒక్కసారి నిప్పులా నెట్టింట ఎగసింది. ఏం జరిగింది? ఏం జరిగింది? మహీ ఏం చేస్తున్నావ్? ధోనీ భయ్ ఏమిటి సంగతి? కొంపదీసి ఆటగాడిగా మానేసి కొత్తగా కోచ్ గా రావడం లేదు కదా… అని తెగ మెసేజ్ ల మీద మెసేజులు పెడుతున్నారు. కామెంటు బాక్సు నిండిపోయింది. ఇంతకీ ఏమిటా కొత్త పాత్ర…అని అందరూ బుర్రలకి పదునుపెడుతున్నారు.

నిజానికి చెప్పాలంటే 42 ఏళ్ల ధోనీ కెరీర్ చివరిదశలో ఉన్నాడు. అంతేకాదు తను క్రికెట్ ఆడటం మొదలెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ ఆటకు సెలవు పెట్టలేదు. నేను పుట్టింటికి వెళ్లాలి, అమ్మను చూడాలనుంది, ఆరోగ్యం బాగా లేదు, వళ్లు నొప్పులున్నాయని ఎప్పుడూ చెప్పలేదు.

విపరీతమైన క్రికెట్ ఆడాడు. ఆడుతూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆఖరి బాల్ వరకు విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. అలాగే విజయాలు సాధిస్తున్నాడు. ఆటగాళ్లు ఆడవచ్చు, ఆడలేకపోవచ్చు. కానీ తను కెప్టెన్ గా మైదానంలో అడుగుపెట్టిన తర్వాత, పదునైన వ్యూహాలతో, ఫీల్డింగ్ మొహరింపుతో, బౌలర్లకి సూచనలిస్తూ మ్యాచ్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. పట్టు బిగిస్తాడు. విజయం సాధిస్తాడు.

అలాగే ఎప్పుడో 1983లో సాధించిన వరల్డ్ కప్ తర్వాత మళ్లీ ధోనీ సారథ్యంలోని టీమ్  2011లో వరల్డ్ కప్ సాధించింది. రెండోది సాధించడానికి టీమ్ ఇండియాకి మూడు దశాబ్దాలు పట్టింది. మళ్లీ ఇంతవరకు లేదు. 2023లో చివరి వరకు వచ్చి బొక్కాబోర్లా పడింది. అలాగే టీ 20 వరల్డ్ కప్ ని 2016లో తెచ్చింది కూడా మహేంద్ర సింగ్ ధోనీయే. మళ్లీ ఇంతవరకు లేదు. సీఎస్కేకి కూడా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఘనత ధోనీకే దక్కుతుంది.

మరి అలాంటి ధోనీ మరేం బాంబు పేల్చబోతున్నాడని అందరూ ఎదురుచూస్తున్నారు.

Dhoni FB Post

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×