Rinku Singh : టీమిండియా ఫినిషర్ రింకు సింగ్ కు ( Rinku Singh) ఊహించని పరిణామం ఎదురైంది. రింకు సింగ్ కు తాజాగా బెదిరింపులు వచ్చాయి. ఈ యంగ్ కుర్రాడు రింకు సింగ్ ను దావూద్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫోన్లు చేసి బెదిరింపులకు కూడా దిగారట. ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. దావూద్ గ్యాంగ్ పేరుతో ఫోన్ చేసి టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారట. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రింకు సింగ్ కు దావూద్ గ్యాంగ్ నుంచి బెదిరింపు ఫోన్లు
టీమిండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కుర్ర క్రికెటర్ రింకు సింగ్ అతి తక్కువ కాలంలోనే టీమిండియాలోకి వచ్చాడు. కేకేఆర్ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు రింకు సింగ్. ముఖ్యంగా యష్ దయాల్ బౌలింగ్ లో ఐదు సిక్సర్లు కొట్టి పాపులర్ అయిపోయాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక టీమ్ ఇండియాలో టి20 స్పెషలిస్ట్ గా మారిపోయిన రింకు సింగ్ ను వణికించేందుకు దావూద్ గ్యాంగ్ రంగంలోకి దిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అండర్ వరల్డ్ డాన్ గ్యాంగ్ సభ్యుల నుంచి రింకు సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తాజాగా ముంబై క్రైమ్ పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో దాదాపు మూడుసార్లు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయట. ఇందులో టీమిండియా కుర్ర క్రికెటర్ రింకు సింగ్ ను ( Rinku Singh) 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ముంబై పోలీసులకు వెల్లడించారు. ఈ బెదిరింపుల వ్యవహారంలో మొహమ్మద్ దిల్షాద్ అలాగే మహమ్మద్ నవీన్ అనే ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళిద్దరూ వెస్టిండీస్ ప్రాంతంలో నివసిస్తుండగా, ఆగస్టు ఒకటో తేదీన ఇండియన్ అధికారులకు అప్పగించారట. అయితే ఇప్పుడు ఈ విషయం నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో పర్మిషన్…దుబాయ్ లో వదిలేశాడుగా !
ఉత్తర ప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు ప్రియా సరోజ్ అనే యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్నాడు రింకు సింగ్. ఈ ఏడాది జూన్ 8వ తేదీన ప్రియా సరోజ్, రింకు సింగ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. లక్నోలోని ఏ ప్రముఖ హోటల్ లో ఈ ఎంగేజ్ మెంట్ జరుగనుంది. అతి కొంది మంది సమక్షంలోనే రింకు సింగ్ ఎంగేజ్ మెంట్ నిర్వహించారు. వచ్చే ఏడాది వీళ్ల ఇద్దరి వివాహం చాలా గ్రాండ్ గా జరుగనుంది.
Cricketer Rinku Singh receives threats from the underworld, Mumbai Police says.
According to the investigation, D-Company, led by terrorist Dawood Ibrahim, sent three ransom demands to Rinku’s promotional team asking for INR 5 crore.#rinkusingh #Cricket pic.twitter.com/Pakm42RjjU
— The Tatva (@thetatvaindia) October 9, 2025