Ind vs WI, 2nd Test: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( Ind vs WI, 2nd Test ) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా గెలవగా వెస్టిండీస్ దారుణంగా ఓడిపోయింది. ఇక రేపటి నుంచి ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది.
Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో పర్మిషన్…దుబాయ్ లో వదిలేశాడుగా !
ఢిల్లీ వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies, 2nd Test ) మధ్య రెండో టెస్ట్ రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ రెండు జట్ల మధ్య ఫైట్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ అలాగే జియో హాట్ స్టార్ లో ( Jio Hotstar ) ఈ మ్యాచ్ స్ట్రీమింగ్ అవుతుంది. వెస్టిండీస్ తో జరిగే రెండో టెస్ట్ నేపథ్యంలో టీమిండియాలో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) రెండో టెస్టులో ఆడటం కష్టమేనని అంటున్నారు.
అతనికి రెస్ట్ ఇవ్వనున్నారట. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ రంగంలోకి దిగనున్నారట. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య త్వరలోనే వన్డే, టీ20 సిరీస్ లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. ఎలాగూ విండీస్ పై టీమిండియా సులభంగానే గెలిచే అవకాశాలు ఉన్న తరుణంలోనూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక అటు యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ( Kl Rahul ) ఇద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. సాయి సుదర్శన్ కోహ్లీ స్థానంలో అంటే మొదటి వికెట్ కు వస్తారు. ఆ తర్వాత గిల్ బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్ లోనూ జురేల్ వికెట్ కీపర్ గా ఉంటాడు.
భారత ప్లేయింగ్ XI అంచనా: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్ (C), ధ్రువ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా లేదా ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ ప్లేయింగ్ XI అంచనా: జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చంద్రపాల్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (WK), అలిక్ అథంజే, రోస్టన్ చేజ్ (C), జస్టిన్