BigTV English
Advertisement

Ms Dhoni : యువత బేకార్ అయిపోయింది.. నా కూతురు కూడా… ఛీ.. ఛీ అంటూ ధోని సంచలన కామెంట్స్

Ms Dhoni : యువత బేకార్ అయిపోయింది.. నా కూతురు కూడా… ఛీ.. ఛీ అంటూ ధోని సంచలన కామెంట్స్

Ms Dhoni : టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం పై వైరల్ అవుతూనే ఉంది. తాజాగా  ధోనీ తన కూతురు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దేశ యువతలో సగటు ఫిట్ నెస్ లెవల్ తగ్గిపోతుందని భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిట్ గా ఉండాలంటే శారీరకంగా శ్రమించాలని ఆయన ఓ ఈవెంట్ లో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతీయుల సగటు ఆయు ప్రమాణం తగ్గుతోంది. శారీరకంగా కష్టపడటం లేదని.. తన కుమార్తె కూడా శారీరకంగా పెద్దగా శ్రమించడం లేదనిపిస్తుంది. ఆమెకు క్రీడలు అంటే ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు మహేంద్ర సింగ్ ధోనీ.


Also Read :  Sara vs Arjun : సారా, అర్జున్ టెండూల్కర్ మధ్య ఇంత తేడా ఉందా.. వీళ్ళిద్దరిని గిల్ భరించాల్సిందేనా !

ఫిట్ నెస్ పై సంచలన ధోనీ కామెంట్స్ 


ధోనీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2020లోనే అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినా ఇంకా ఫిట్ నెస్ ని కాపాడుకుంటూ ఐపీఎల్ ఆడుతున్నాడు. అందుకే 44 ఏళ్ల వయస్సులో కూడా ధోనీ మైదానంలో చాలా చురుకుగా ఉంటున్నాడు. గత ఐపీఎల్ సీజన్ లో వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదులుతూ రెప్పపాటుతో స్టంపింగ్స్ చేసి ఔరా అనిపించాడు.వాస్తవానికి ఈ రోజుల్లో ప్రజలు తాము ఉన్న వయస్సు కంటే తక్కువ వయస్సులో ఉన్నామనుకొని అనుభూతి చెందుతున్నారు. ఫిట్ గా ఉండాలంటే.. శారీరకంగా శ్రమించాల్సిందే. అందుకోసం పలు పనులు చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం బెటర్. మొత్తానికి ధోనీ చెప్పిన ఫిట్ నెస్ సూత్రం అందరికీ ఉపయోగపడుతుంది. ధోనీ తన కూతురు గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

క్షీణిస్తున్న భారతీయు ఆయు ప్రమాణం.. 

టీమిండియా కి మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోనీ.. 44 ఏళ్ల వయస్సులోనూ క్రికెట్ ఆడుతున్న విషయం విధితమే. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి సారథిగా 5 ట్రోఫీలు అందించిన తలా.. ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో మరోసారి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా పేర్గాంచిన ధోనీ.. నాలుగు పదుల వయస్సు దాటిన తరువాత కూడా మైదానంలో పాదరసంలా కదలడం విశేషం. వికెట్ల మధ్య పరుగులు తీయడంలోనూ యువ ఆటగాళ్లకు అతడు పోటీ ఇస్తాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా భారతీయుల సగటు ఆయు ప్రమాణం రోజురోజు క్షీణిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ధోనీ 2010లో సాక్షి సింగ్ రావత్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2015లో కుమార్తె పుట్టగా.. జీవగా నామకరణం చేశారు. పదేళ్ల జీవా కాస్త బొద్దుగా ఉండేది. తల్లి సాక్షితో కలిసి ధోనీ మ్యాచ్ లు చూసేందుకు వచ్చే జీవా.. తండ్రి ఆటను ఆస్వాదిస్తూ.. ఉత్సాహపరచడంలో ముందే ఉంటుంది. ఈ నేపథ్యంలో ధోనీ కూతురు గురించి కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది.

 

Related News

Navjot -MS Dhoni: పెళ్లి తర్వాత ధోని ఎన‌ర్జీ డౌన్‌… సిద్ధూది మాత్రం ఏ రేంజ్‌.. పోస్ట్ వైర‌ల్‌

Ind vs Aus, 1st T20: టీమిండియాదే బ్యాటింగ్‌.. అభిషేక్ శ‌ర్మ సెంచ‌రీ చేస్తాడా…? 3 టీ20లకు నితీష్ కుమార్ దూరం

Suryakumar Yadav Mother: ఆస్ప‌త్రిలో శ్రేయాస్‌.. సూర్య కుమార్ త‌ల్లి సంచ‌ల‌న నిర్ణ‌యం

Bumrah-Harshit: ఒరేయ్ పిల్ల బ‌చ్చా.. అవేం బూట్లురా, హ‌ర్షిత్ రాణా ప‌రువు తీసిన బుమ్రా

Telugu Titans: ద‌క్షిణాఫ్రికాకు WTC, ఆర్సీబీకి IPL 2025, ఇక నెక్ట్స్ తెలుగు టైటాన్సే లోడింగ్‌

Telugu Titans: తెలుగు టైటాన్స్ అదిరిపోయే విజ‌యం.. కోచ్ కు క‌న్నీళ్లు ఆగ‌లేదు

Ind vs Aus, 1st T20: నేడే టీమిండియా, ఆసీస్ తొలి టీ20..హెడ్ వ‌ర్సెస్ అభిషేక్‌.. టైమింగ్స్‌, ఫ్రీగా ఎలా చూడాలంటే

Dhoni-Kohli: ఇండియాలో స్వేచ్ఛ‌గా తిరుగుతున్న‌ ధోని..కానీ ఫ్రీడమ్ లేద‌ని లండ‌న్ కు కోహ్లీ..!

Big Stories

×