Pawan Kalyan: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి సక్సెస్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు పడ్డాయి. ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ మారిపోయింది.
మొదటిసారి దర్శకుడిగా జానీ అనే సినిమాను చేశాడు. ఆ సినిమా ఊహించని డిజాస్టర్ అయింది. ఆ సినిమా గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా అయితే ఆడలేదు కానీ టెక్నికల్ గా పవన్ కళ్యాణ్ ఎంత స్ట్రాంగ్ అని ఇప్పుడు చాలామందికి అర్థం అవుతుంది. ఆ రోజుల్లోనే అద్భుతంగా పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేశారు. మరోసారి జానీ సినిమా గురించి హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో ప్రస్తావించారు.
డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పెట్టారు
మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి అన్నయ్య ఉండి, నేను సినిమాల్లో సక్సెస్ఫుల్ అయి ఉండి. నేను డైరెక్ట్ చేసిన జానీ అనే సినిమా ఆడకపోయిన వెంటనే, ఒక ఐదు రోజుల్లో పది రోజుల్లో నెలరోజుల తర్వాత కాదు. ఫస్ట్ షో పడింది ఇది బాగోలేదు అనగానే మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ ఫైనాన్సర్స్ అందరూ నా ఇంటి మీదకు వచ్చేసారు. మాకు డబ్బులు రావట్లేదు ఇప్పుడు ఏం చేస్తావని అడిగారు.? నాకు క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు వచ్చినప్పుడు నాకు ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు కదా అని ఉంది. కానీ నేను అలా అనలేదు. కార్ల మార్క్స్ చెప్పినట్లు అన్ని బంధాలు ఆర్థిక బంధాలు అని గుర్తొచ్చింది. ఆ రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేశాను. ఆ తర్వాత 15 లక్షల వరకు అప్పుడే అప్పు చేశాను.
ఒంటరితనం అనుభవించాను
ఆ క్షణంలో ఒంటరితనం అనుభవించాను. ఇప్పుడు ఎలా ఉందంటే గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ నేను చేసేసి. అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధ పడాలో, సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తూ ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేశా బాగోలేదు అది ఆడలేదు అంతే. దానికి ఏదో కొంప మునిగిపోయినట్లు ముఖాలు ఏమో ఇలా పెట్టుకుని,ఒకే నష్టపోతే ఎంత నష్టపోయిందో చూద్దాం, ఫైనల్ గా ఏదో నేను చేయగలిగింది చేశా. ఆ అనుభవం నన్ను బలమైన వ్యక్తిని చేసింది. జానీ ఫెయిల్యూర్ నాకు పాలిటిక్స్ లో హెల్ప్ చేసింది. 2019లో ఓడిపోతే నాకు మళ్ళీ అదే గుర్తొచ్చింది.