Rohit Sharma : టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కి ఘోర అవమానం జరిగిందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు కనిపించకపోవడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ టెస్ట్, టీ-20 క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. వీరిద్దరి వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో లేకపోవడం గమనార్హం. గత వారం వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ 756 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 784 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగాడు. తాజా ర్యాంకింగ్స్ అప్డేట్ లో ఇద్దరూ జాబితాలో లేరు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక ఆటగాడు విరాట్ కోహ్లీలకు అవమానం జరిగిందనే చెప్పాలి. వాస్తవానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఐపీఎల్ తరువాత ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.
Also Read : Nicholas Pooran : స్టంప్ ఔట్ ఎఫెక్ట్… నికోలస్ పురాన్ కిందపడి ఎలా గిలగిల కొట్టుకున్నాడో చూడండి
రోహిత్ కి అవమానం..
వారి చివరి మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఐసీసీ నియమాల ప్రకారం.. ఒక ఆటగాడు 9-12 నెలలు ఒక ఫార్మాట్ లో ఆడకపోతే.. అతను టాప్ 100 నుంచి తొలగించబడుతాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ విషయం పై ఐసీసీ స్పందించి.. కొద్ది గంటల్లోనే ర్యాంకింగ్స్ ను పునరుద్ధరించింది. మరోవైపు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా-ఏ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్ లో ఆడనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఆడటం వల్ల ఫిట్ నెస్ సాధిస్తారని.. ఆటలో మంచి ప్రతిభ కనబరుస్తారని అందుకే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ఏ జట్టుతో తలపడే మ్యాచ్ లో ఆడనున్నట్టు సమాచారం. ఇదిలా మరోవైపు టీమిండియా ప్లేయర్లకు కొత్త రూల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
గాయాలు తగ్గించడం కోసం..
భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్ల ఫిట్ నెస్ ప్రమాణాలను మరోస్థాయి కి తీసుకెళ్లేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నడుం బిగించింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు పదే పదే గాయాల బారిన పడుతుండటంతో వారి ఫిట్ నెస్ ను మెరుగు పరిచే లక్ష్యంతో బ్రాంకో టెస్ట్ అనే సరికొత్త కఠినమైన పరీక్షను ప్రవేశపెట్టింది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో పలువురు గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే అమలులో ఉన్న యో-యో టెస్ట్, 2 కిలోమీటర్ల టైమ్ ట్రయల్ అదనంగా ఈ బ్రాంకో టెస్ట్ ను చేర్చారు. ఈ పరీక్షలో భాగంగా ఆటగాళ్లు 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల చొప్పున షటిల్ రన్స్ చేయాలి. ఈ మూడింటిని ఒ సెట్ గా పరిగణిస్తారు. ఇలా మొత్తం ఐదు సెట్లను విరామం లేకుండా పూర్తి చేయాలి. కేవలం 6 నిమిషాల వ్యవధిలో 1200 మీటర్ల దూరాన్ని పరుగెత్తాల్సి ఉంటుంది.