BigTV English

Krunal Pandya Emotional Post: బచ్చూ.. నిన్ను చూసి గర్విస్తున్నా: కృనాల్

Krunal Pandya Emotional Post: బచ్చూ.. నిన్ను చూసి గర్విస్తున్నా: కృనాల్

Krunal Pandya Pens Emotional Note for Brother Hardik Pandya after his WC Triumph: బచ్చూ.. అంటే ఎవరా? అని కంగారుపడుతున్నారా? అదేం లేదండి. అది ఒకరి ముద్దు పేరు. చిన్నప్పుడు అందరినీ అలాగే పిలుస్తారు కదా, చింటూ, బంటీ, పప్పీ అని అలాగే బచ్చూ అన్నమాట. ఇంతకీ ఈ బచ్చూ ఎవరా? అని ఆలోచిస్తున్నారా? ఆయనెవరో కాదండీ.. టీ 20 ప్రపంచకప్ హీరో హార్దిక్ పాండ్యా..


ఇంతకీ మాట ఇప్పుడెందుకు వచ్చిందని అంటారా? హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా ఒక పోస్ట్ పెడుతూ.. బచ్చూ ఐలవ్ యూ.. నిన్ను చూసి గర్వపడుతున్నానని అని రాసుకొచ్చాడు.
అదేనండీ టీ 20 ప్రపంచకప్ విజేతగా టీమ్ ఇండియా నిలవడంలో హార్దిక్ పాండ్యా పాత్రను ఎవరూ మరిచిపోలేరు. ఆ నేపథ్యంలోనే సోదరుడు కృనాల్ పోస్ట్ తో పాటు ఒక చిన్న పిల్లవాడు కప్ పట్టుకుని ఉన్న ఫొటోని పోస్ట్ చేశాడు.

అప్పుడు ఆ కప్, ఇప్పుడు ప్రపంచకప్.. నాడు బరోడా నుంచి మొదలైన నీ ప్రయాణం.. ఇంకా ఇంకా అనంతంగా సాగిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. హార్దిక్ పేరు దేశంలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందని అన్నాడు. అంతకుముందు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబయి ఇండియన్స్ కి కెప్టెన్ గా మారినప్పుడు, అతనెదుర్కొన్న అవమానాలు, ఛీత్కారాలు, తిట్లు అన్నీ ఇన్నీ కావు.


Also Read: తొలి టీ 20లో గెలిచిన జింబాబ్వే.. పసికూనల చేతిలో ఓడిన కుర్రాళ్లు

ఈ క్రమంలోనే కుటుంబంలో కూడా కలతలు, భార్యతో మనస్పర్థలు వీటన్నింటిని తట్టుకుని పాండ్యా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023 లో గాయంతో మైదానం వీడి, ఐపీఎల్ కి వచ్చిన తనకి గడిచిన ఆరునెలలు ఒక పీడకలని చెప్పాలి. అయినా సరే, అవన్నీ గుండెలపై ఉన్నా, టీ 20 ప్రపంచకప్ లో అత్యద్భుతంగా ఆడి, ఏకంగా ప్రపంచకప్ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ నేపథ్యంలో రాళ్లు విసిరిన చేతులతోనే పూవులు విసిరారు. ఈ నేపథ్యంలోనే సోదరుడు కృనాల్ తన ఆవేదనను ఇలా వ్యక్తం చేశాడని నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి హార్దిక్ చిన్ననాటి ఫొటో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×