Nasser Hussain: టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) నేపథ్యంలో మొన్న ఆదివారం పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India Women vs Pakistan Women ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా, 64 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 170 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని చేదించలేక 106 పరుగులకే ఆల్ అవుట్ అయింది పాకిస్తాన్. దీంతో మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో టీమిండియా శుభారంభం చేసింది. అయితే పాకిస్తాన్ మహిళల జట్టుపై టీమిండిగా గెలిచిన నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాసర్ హుస్సేన్ (Nasser Hussain) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు టీమిండియా, పాకిస్తాన్ మధ్య పోటీ సరైంది కాదని బాంబు పేల్చారు. పసికూనపై పంజా విసిరినట్లుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పెట్టారని ఇవ్వండి పడ్డారు. పాకిస్తాన్ ప్లేయర్లకు కూడా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (WPL) ఆడే అవకాశం కల్పించాలని… అలాంటప్పుడే టీం ఇండియాను ఓడిస్తారని కీలక సూచనలు చేశారు. ఆ దిశగా బీసీసీఐ అడుగులు వేస్తే బాగుంటుందన్నారు.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును టీమిండియా ఓడించిన సందర్భంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాసర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాతో పాకిస్తాన్ కు మ్యాచ్ పెట్టడం బుర్ర తక్కువ పని అంటూ ఐసీసీపై మండిపడ్డారు. ఇండియాలో వ్యూయర్షిప్ పెరగాలని ఇలా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు నిర్వహిస్తున్నారని సీరియస్ అయ్యారు. బలమైన టీమిండియా మహిళల జట్టు ముందు.. పాకిస్తాన్ మహిళలు దేనికి పనికిరారని పరువు తీశారు.
అయితే టీమిండియా తరహాలో పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు ఆడాలంటే… ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ( WPL Tournament) అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండియా ప్లేయర్ లందరూ…WPL లాంటి ఫ్రాంచైజీ లీగ్స్ లలో ఆడి, అనుభవాన్ని గడిస్తున్నట్లు వెల్లడించారు. కానీ పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ క్రికెటర్లకు అలాంటి సదుపాయాలు లేవని బాంబు పేల్చారు. ఈ రెండు జట్ల క్రికెటర్లకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో కచ్చితంగా అవకాశం ఇవ్వాలని… అప్పుడే వాళ్ళు అభివృద్ధి చెందుతారన్నారు. లేకపోతే 100 సంవత్సరాలైనా ఇండియా పై గెలవడం కష్టమేనని తేల్చి చెప్పారు నాసర్ హుస్సేన్. దాంతోపాటు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కచ్చితంగా నిర్వహించవలసిన అవసరము ఉందని వ్యాఖ్యానించారు. రెండు జట్ల మధ్య స్నేహ బంధాలు పెరగాలన్నారు.