E-Paper

మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం
Advertisement

Shoaib Akhtar On Ind vs Pak:  మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament) నేపథ్యంలో ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ‌హిళ‌ల ( Team India Women vs Pakistan Women) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎడ్జ్ బస్టన్ ( Edgbaston, Birmingham) వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 64 పరుగులు తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు దారుణ ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై మాజీలు సీరియస్ అవుతున్నారు. షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) కూడా తాజాగా స్పందించారు. ఇంకా ఎన్నిసార్లు టీమిండియా చేతిలో ఓడిపోతారు ? కొంచెమైన సిగ్గు అనిపించడం లేదా ? ఉరేసుకుని చావండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ( Pakistan Team) ఓడిపోతుంటే, కామెంట్రీ ప్యానల్ లో కూర్చోలేకపోతున్నామని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది… ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

Advertisement

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament)  నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న ఆరవ మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళల జట్టు 170 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. 17 ఓవర్లలో 106 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. దీంతో 64 పరుగులు తేడాతో టీమిండియా విక్టరీ అందుతుంది. అయితే పాకిస్తాన్ ఓటమి చవిచూసిన నేపథ్యంలో షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఎమోషనల్ అయ్యారు.

పురుషుల జట్టు నుంచి మొదలుకొని మహిళలు, అండర్ 19 వరకు ఎవరు కూడా టీమిండియాను ఓడించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ టీం ఇండియాతో మ్యాచ్ జరిగినా, పాకిస్తాన్ పోటీ ఇవ్వలేకపోతోందని బాంబు పేల్చారు. ఇది పాకిస్తాన్ దేశానికే సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యారు. టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతుంటే… కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక పోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కంటే పాకిస్తాన్ వేల రెట్లు వెనుకబడి పోయామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దరిద్రం ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ క్రికెట్ చూడడం అందరూ మానేస్తారని బాంబు పేల్చారు. ఎలాగూ టీమిండియా గెల‌వ‌లేరు…పాకిస్తాన్ పురుషులు, మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లు ఆడించాల‌ని ఐసీసీని కోరారు అక్త‌ర్‌.

Advertisement

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

 

 

Related News

ఇషాన్‌ కిషన్‌కు వీసా వ‌చ్చేసింది…వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత‌డు త‌ప్పుకోవాల్సిందే !

ఫాతిమా సనాకు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ‘ది హండ్రెడ్ 2026’ లోకి వైల్డ్‌కార్డ్

Tanveer Ahmed : నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

ఫాతిమా స‌నా గ్రేట్ లీడర్…ఆమె ఒక్క‌తే పోరాటం చేస్తే పాక్ గెల‌వ‌దు !

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్‌ వ‌ద్దు…ఇప్పుడు టీమిండియాకు ధోని సేవ‌లు కావాలి

గిల్ పెద్ద సెల్ఫీష్‌..వాడి వల్లే డ‌బుల్ సెంచ‌రీ మిస్ అయింది !

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు భారీగా పెరిగిన జీతాలు..ఏకంగా 500 శాతం ?

Javed Miandad: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు రా నాయ‌నా, అంద‌రినీ ఫూల్స్ చేసి గేమ్స్ ఆడుతున్నాడు

Big Stories

×