E-Paper
Advertisement

విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫీష్‌..అంబ‌టి రాయుడు కెరీర్ ను తొక్కేశాడు!

విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫీష్‌..అంబ‌టి రాయుడు కెరీర్ ను తొక్కేశాడు!
Advertisement

Robin Uthappa On Kohli and Rayudu:  టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తర్వాత.. ఆ స్థాయికి ఎదిగిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే. అండర్ 19 వరల్డ్ కప్ లో అదరగొట్టి… టీవి ఇండియాలోకి వచ్చిన విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని తర్వాత కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. 2013 నుంచి 2022 వరకు తన ఆరా నడిచింది. అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కొంతమంది క్రికెటర్ల కెరీర్లను నాశనం చేశాడని ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇదే విషయాన్ని తాజాగా రాబిన్ ఉతప్ప (Robin Uthappa) బయటపెట్టారు. అంబటి రాయుడు వరల్డ్ కప్ 2019 కోసం (India’s 2019 World Cup squad ) సెలెక్ట్ కాగా, చివరి క్షణంలో అతన్ని తప్పించారు. దీనికి కారణం విరాట్ కోహ్లీ అంటూ రాబిన్ ఉతప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీకి అంబటి రాయుడు (Ambati Rayudu) అంటే అస్సలు నచ్చలేదని.. అందుకే సెలెక్ట్ అయిన అతడిని కావాలని తప్పించేలా కుట్ర జరిగిందని బాంబు పేల్చారు. దీంతో రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫీష్‌..అంబ‌టి రాయుడు కెరీర్ ను తొక్కేశాడంటూ

2019లో వన్డే వరల్డ్ కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. అంబటి రాయుడు మంచి ఊపులో ఉన్నాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ లో అంబటి రాయుడు ఉన్నాడని లిస్టు కూడా బయటకు వచ్చింది. వరల్డ్ కప్ కిట్ కూడా అతని ఇంటికి పంపించారు. సడన్ గా ఏమైందో తెలియదు గానీ… అంబటి రాయుడును పక్కకు పెట్టేసి, మరొకరికి అవకాశం ఇచ్చారు. అయితే ఈ అంశంపై తాజాగా రాబిన్ ఉతప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 వన్డే వరల్డ్ కప్ నుంచి చివరి క్షణంలో అంబటి రాయుడు తప్పించబడ్డాడని పేర్కొన్నారు. దీనికి కారణం విరాట్ కోహ్లీ అంటూ బాంబు పేల్చాడు.

Advertisement

విరాట్ కోహ్లీకి నచ్చిన వాళ్ళు మాత్రమే టీమిండియాలో ఉంటారని.. అతనికి నచ్చకపోతే బయటకు పంపిస్తాడని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. అంబటి రాయుడు విషయంలో కూడా అదే జరిగిందని వ్యాఖ్యానించారు. చివరి క్షణంలో అంబటి రాయుడు వరల్డ్ కప్ ఆడకుండా విరాట్ కోహ్లీనే కుట్రలకు తెర లేపినట్లు ఆరోపణలు చేశారు. విరాట్ కోహ్లీ చాలా సెల్ఫిష్ అని.. తనకంటే మరో ఆటగాడు ఎదిగితే అస్సలు తట్టుకోలేడని బాంబు పేల్చారు. వరల్డ్ కప్ నుంచి అంబటి రాయుడును బయటకు పంపించినప్పటికీ…. విరాట్ కోహ్లీని రాయుడు ఏమనలేదని గుర్తు చేశారు. జట్టు నుంచి తొలగించినందుకు విరాట్ కోహ్లీని తాను విమర్శించబోనని అంబటి రాయుడు తనతో చెప్పినట్లు వివరించారు.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

 

 

Related News

టీమిండియాతో మ్యాచ్‌..భ‌య‌ప‌డి పారిపోయిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

Big Stories

Advertisement
×