Alzarri Joseph Vs Daren Sammy: వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్, విక్టరీ అందుకుంది. దీంతో పాకిస్తాన్ తీవ్ర నిరాశకు గురైంది. అయితే సజావుగా ఈ టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టులో జరుగుతున్న అంతర్యుద్ధం బయటపడింది. వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీతో అల్జారీ జోసెఫ్ గొడవకు దిగారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అల్జారీ జోసెఫ్ ను అనవసరంగా గెలికాడు కోచ్ సమి. అల్జారీ జోసఫ్ ను జాతీయ జట్టులోకి తీసుకుంటామని తాము ఆఫర్ ఇచ్చినప్పటికీ… అతడు రిజెక్ట్ చేసినట్లు డారెన్ సమీ సంచలన ఆరోపణలు చేశారు. అయితే దానికి కౌంటర్ గా తాజాగా అల్జారీ జోసఫ్ షాకింగ్ నిజాలు బయటపెట్టారు. తనకు ఎవరు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని…డారెన్ సమీ ప్రతిదీ అబద్ధమే మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. తాను వెస్టిండీస్ కోసం ప్రాణాలైనా ఇస్తానని వెల్లడించారు. ఇప్పుడు బరిలోకి దిగి ఆడమన్న ఆడతానని వివరించారు. కోచ్ డారెన్ సమీతో గొడవలు ఉన్నప్పటికీ… అతని కోసం కాకుండా వెస్టిండీస్ కోసం తాను ఆడతానని వివరించారు. తన ఆట తాను ఆడుకుంటాను.. డారెన్ సమీ జోలికి వెళ్లబోనని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య మాటలు యుద్ధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్, డారెన్ సమీ మధ్య గొడవ 2024 నవంబర్ 26వ తేదీన జరిగింది. ఆ సమయంలో ఇంగ్లాండ్ తో మూడవ వన్డే ఆడింది వెస్టిండీస్. అయితే ఆ మూడవ వన్డేలో అల్జారీ జోసెఫ్ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో కెప్టెన్ షాయ్ హోప్ ఫీల్డర్లను సెట్ చేశాడు. అక్కడితో ఆగకుండా కోచ్ డారెన్ సమీ కూడా డగౌట్ నుంచి ఫీల్డర్లను సెట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది అల్జారీ జోసఫ్ కు నచ్చలేదు. దీంతో, తన ఓవర్ ముగిసిన తర్వాత మైదానం నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ నాలుగు ఓవర్ సందర్భంగానే జరిగింది. దీంతో అల్జారీ జోసఫ్ వేయాల్సిన మిగిలిన ఓవర్లన్నీ… వేయించడానికి కెప్టెన్ షాయ్ హోప్ చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ మధ్యలో వెళ్లినందుకు అల్జారీ జోసెఫ్ పై రెండు మ్యాచ్ లు ఆడకుండా బ్యాన్ విధించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డారెన్ సమీ, జోసెఫ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
Also Read: Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !